వైసీపీకి మరో ఎంపీ షాక్‌..!

ABN, Publish Date - Feb 27 , 2024 | 10:06 AM

ప్రకాశం జిల్లా: ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. కానీ అధికారపార్టీలో వరుసగా పరాభవాలు ఎదురవుతున్నాయి. దీంతో అధికారపార్టీలో ఇమడలేక పక్క పార్టీలవైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ప్రకాశం జిల్లా: ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత. కానీ అధికారపార్టీలో వరుసగా పరాభవాలు ఎదురవుతున్నాయి. దీంతో అధికారపార్టీలో ఇమడలేక పక్క పార్టీలవైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనను వైసీపీ పక్కన పెట్టి.. సీఎం జగన్ షాకిచ్చారు. దీంతో ఆయన భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టారు. టీడీపీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. టీడీపీలోకి వస్తానంటూ ఆ పార్టీ ముఖ్యనేతలతో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated at - Feb 27 , 2024 | 10:06 AM