దటీజ్.. సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Dec 07 , 2024 | 04:16 PM

Andhrapradesh: బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఓ విద్యార్థి ప్రసంగించాడు. అనంతరం ఆ అబ్బాయితో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడటం ప్రారంభించిన సమయంలో ఉన్నట్టుండి నమాజ్ ప్రారంభమైంది.

అమరావతి, డిసెంబర్ 7: మత సంప్రదాయాలు, ధార్మిక ప్రార్థనలు గౌరవించే సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గొప్ప సంస్కారానికి నిదర్శనగా ఓ సంఘటన జరిగింది. శనివారం బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఓ విద్యార్థి ప్రసంగించాడు. అనంతరం ఆ అబ్బాయితో సీఎం మాట్లాడటం ప్రారంభించిన సమయంలో ఉన్నట్టుండి నమాజ్ ప్రారంభమైంది.

ఈగల్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు


వెను వెంటనే ముఖ్యమంత్రి మాటలు ఆపి మౌనం పాటించారు. దీంతో సభలోని వారందరూ చంద్రబాబును అనుకరించడంతో సభలో పిన్ డ్రాప్ సైలెన్స్ నెలకొంది. నమాజ్ ముగిసిన తర్వాతనే తిరిగి సీఎం ప్రసంగం ప్రారంభమైంది. మత సంప్రదాయాలను, ప్రార్ధనలను గౌరవించడంలో ముందుడే వ్యక్తి సీఎం చంద్రబాబు అంటూ సభకు వచ్చిన వారిలో చర్చించుకున్నారు.


ఇవి కూడా చదవండి..

Flights: గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానాలు..

బోరుగడ్డకి మరో దెబ్బ ఇక జైల్లోనే..

Read Latest AP News And Telugu News

Updated at - Dec 07 , 2024 | 04:16 PM