ఆ మున్సిపాలిటీలో అక్రమాలపై ఏసీబీ ఆరా
ABN, Publish Date - Dec 10 , 2024 | 04:26 PM
Telangana: గతంలో మణికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో డీఈగా పనిచేసిన దివ్యజ్యోతిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆమె భర్తే.. దివ్యజ్యోతి తీసుకున్న లంచాలకు సంబంధించిన డబ్బును మీడియా ముందు ఉంచారు. అలాగే వీడియోల రూపంలోనూ రిలీజ్ చేశారు. ప్రతీ పనికి కూడా దివ్యజ్యోతి డబ్బు తీసుకుంటారని, తీసుకున్న డబ్బును ఇంట్లో ఎక్కడెక్కడ ఉంచుతారు అనే అంశాలను వీడియో రికార్డ్ చేసి విడుదల చేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 10: మణికొండ మున్సిపాలిటీలో ఏసీబీ (ACB) దాడులు కొనసాగుతున్నాయి. డీఈ దివ్య జ్యోతి నివాసంలో దొరికిన డబ్బుపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. గత రెండేళ్లలో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. మణికొండ మున్సిపాలిటీలో అధికారులపై వరుసగా ఫిర్యాదులు అందాయి. కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మనోజ్- మోహన్ బాబు మధ్య గొడవకు కారణం అదే..
గతంలో ఇదే కార్యాలయంలో డీఈగా పనిచేసిన దివ్యజ్యోతిపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. స్వయంగా ఆమె భర్తే.. దివ్యజ్యోతి తీసుకున్న లంచాలకు సంబంధించిన డబ్బును మీడియా ముందు ఉంచారు. అలాగే వీడియోల రూపంలోనూ రిలీజ్ చేశారు. ప్రతీ పనికి కూడా దివ్యజ్యోతి డబ్బు తీసుకుంటారని, తీసుకున్న డబ్బును ఇంట్లో ఎక్కడెక్కడ ఉంచుతారు అనే అంశాలను వీడియో రికార్డ్ చేసి విడుదల చేశారు. ఈ క్రమంలో దివ్యజ్యోతిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆమెపై ఏసీబీ అధికారులు నిఘా ఉంచారు. దివ్యజ్యోతి మణికొండ మున్సిపాలిటీలో పనిచేస్తున్న సమయంలో ఏఏ ఫైల్స్‌పై సంతకం చేశారు, ఏఏ ఫైళ్లను క్లియర్ చేశారనే అంశాలపై ఏసీబీ దృష్టిసారించారు.
ఫైళ్లను క్లియర్ చేసే క్రమంలో అవినీతికి పాల్పడ్డారా అనే దానిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పుప్పాలగూడతో పాటు తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు కొనసాగుతుంటాయి. ఈ నిర్మాణాలను కొనసాగించేందుకు వీలుగా అనుమతులు ఇచ్చే సమయంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. అక్రమ అనుమతులు ఇచ్చేందుకు వీలుగా పెద్ద మొత్తంలో లంచాలు తీసుకోవడంతో పాటు అక్కడ పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ వద్ద సమాచారం ఉంది. ఇందులో భాగంగానే సోదాలు కొనసాగుతున్నాయి.
Updated at - Dec 10 , 2024 | 04:26 PM