బీఆర్‌ఎస్ అవినీతిపై కేంద్రం దర్యాప్తు చేయదేం?
ABN, Publish Date - Mar 05 , 2024 | 05:28 AM
సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో మందిని అరెస్ట్ చేయించిందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి,
నీటి వాటా తేల్చకుండా ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదు:జూపల్లి
సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో మందిని అరెస్ట్ చేయించిందని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతి, దోపిడీపై మాత్రం ఎందుకు దర్యాప్తు చేయించలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలది అవినీతి, బంధుప్రీతి అంటూ ఆదిలాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఎందుకు విచారణ చేయడంలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలిసీ కేంద్రం ఎందుకు దర్యాప్తు చేయించలేదో సమాధానం చెప్పాలన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను తేల్చకుండా కేంద్రం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. నీటి వాటాను తేల్చకుండా రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీజేపీకిలేదన్నారు. కేసీఆర్ కుటుంబానిది అవినీతి, బంధుప్రీతి అంటే ఓ అర్థం ఉందని... గాడిదను, గుర్రాన్ని ఒకే గాటన కట్టడం సరికాదన్నారు.
Updated at - Mar 05 , 2024 | 08:52 AM