Share News

యథేచ్ఛగా చౌర్యం!

ABN , Publish Date - Mar 12 , 2024 | 11:47 PM

సింగరేణి యాజమాన్యం చేతగాని తనమో.. అధికారుల లాలూ చీ వ్యవహారమో తేలీదు కాని విజి‘లెన్స్‌’ కళ్లుగప్పి ఏటా వందలకోట్ల విలువైన బొగ్గు మాయమైపో తోంది. అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. సింగరేణి పరిధిలోని కొత్తగూడెం మొదలుకొని రామ గుండం పారిశ్రామిక ప్రాంతం వరకు ఉన్న బొగ్గు గనుల ప్రాంతమంతా క్రమంగా కోల్‌స్మగ్లింగ్‌ మాఫి యాకు అడ్డాగా మారింది.

యథేచ్ఛగా చౌర్యం!
మంథనిలోని భూపాలపల్లి ఓసీపీ-1 నుంచి ఆర్‌జీ-3కు బొగ్గు లోడుతో పట్టుబడిన లారీల నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు (ఫైల్‌)

కోల్‌బెల్టులో బొగ్గు మాఫియా

సింగరేణి కళ్లు గప్పి అక్రమ వ్యాపారం

దొడ్డిదారిన హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు రవాణా

సింగరేణి ఖజానాకు ఏటా రూ.110కోట్లకు పైగా నష్టం?

దందాలో అందరికీ వాటాలు!

భూపాలపల్లి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): సింగరేణి యాజమాన్యం చేతగాని తనమో.. అధికారుల లాలూ చీ వ్యవహారమో తేలీదు కాని విజి‘లెన్స్‌’ కళ్లుగప్పి ఏటా వందలకోట్ల విలువైన బొగ్గు మాయమైపో తోంది. అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. సింగరేణి పరిధిలోని కొత్తగూడెం మొదలుకొని రామ గుండం పారిశ్రామిక ప్రాంతం వరకు ఉన్న బొగ్గు గనుల ప్రాంతమంతా క్రమంగా కోల్‌స్మగ్లింగ్‌ మాఫి యాకు అడ్డాగా మారింది. ఇందులో మరీ ముఖ్యంగా భూపాలపల్లి, బెల్లంపల్లి ఏరియాల్లోనైతే స్మగ్లింగ్‌ దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది. ఇటీవల భూపాలపల్లి ఓసీపీ-1 నుంచి రామగుండం ఆర్‌జీ-3కి రవాణా జరుగుతున్న బొగ్గును సింగరేణికి చెందిన అధికారికంగా బొగ్గు రవాణా చేసే వారే వాహనాలకు ఉన్న జీపీఎస్‌లను వేరే వాహనాలకు అమర్చి.. విజిలెన్స్‌ను ఏమార్చి దాదాపు 200 టన్నుల బొగ్గును తస్కరించిన ఘటన వెలుగులోకి రావడం ఇక్కడ జరుగున్న తతంగానికి దర్పణం పడుతోంది.

అధిక ధరతో దొంగలకు పంట..

సింగరేణి ద్వారా విక్రయిస్తున్న బొగ్గు బహిరంగ మార్కెట్‌లో నాణ్యతనుబట్టి టన్ను రూ.2,500 నుంచి రూ.3,000 పైచిలుకు పలుకుతుండటం బొగ్గు దొంగల పంట పండుతోంది. దీంతో కొత్తగూడెం, భూపాలపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సెంటినరికాలనీ, ఎన్‌టీపీసీ తదితర ప్రాంతాల్లో బొగ్గు చౌర్యం ఒక వృత్తిగా మారింది. ఇదంతా సింగరేణి అధికారుల కళ్లెదుటే జరుగుతున్నా మొద్దు నిద్ర నటిస్తున్నారన్న విమర్శ లున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లికి చెందిన ఓ వ్యాపారి ఓ అడుగు ముం దుకేసి ఏకంగా కూలీలను పెట్టి మరీ బొగ్గు చౌర్యం చేయి స్తూ తాను రెండు చేతు లా ఆర్జించటమే కాకుం డా స్థానిక ప్రజాప్రతి నిధులు, రాజకీయ నేతలు, పోలీసులకు ముడుపులు ముట్ట జెపుతూ అక్రమ వ్యాపారాలు చేస్తున్నాడనే ఆరోప ణలు ఉన్నాయి. ఇందుకు సింగరేణి, ఎన్‌టీపీసీ సిబ్బంది కూడా సహకరి స్తున్నారన్న విమర్శలున్నాయి. ఫలితంగా సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో ఏటా సంస్థ ఖజానాకు దాదాపు రూ.110 కోట్ల పైచిలుకు చిల్లు పడుతున్నట్లు అంచనా. బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే తరహాలో బొగ్గు తస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. నల్ల బంగారంగా పిలవబడుతున్న బొగ్గు అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది.

బడా వ్యక్తుల వెన్నుదన్నుతో..

సింగరేణి గనులు విస్తరించి ఉన్న కొత్తగూడెం నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతం వరకు కొందరు బడా రాజకీయ నాయకులు, పోలీసు అధికా రుల దన్నుతో ఝార్ఖండ్‌ తరహాలో మాఫియాను తలదన్నే రీతిలో ఏటా సుమారు రూ.110కోట్ల విలువైన బొగ్గు లూటీ యథేచ్ఛగా సాగుతోందన్న విమర్శలున్నాయి. ఈ తతంగంలో రాజకీయ నేతలతో పాటు సింగరేణి, నేషనల్‌ థర్మల్‌ పవర్‌స్టేషన్‌ సిబ్బంది, సింగరేణి సెక్యూరిటీ ఫోర్స్‌ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. భూపాలపల్లి సహా ఆయా జిల్లాల్లో గడచిన కొన్నేళ్లుగా ఈ వ్యవహారం గుట్టు గా సాగుతోంది. ఇటీవల మరీ అధికంగా చౌర్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా రామగుండం, కొత్తగూడెం ప్రాం తాల్లో రైల్వే వ్యాగన్ల నుంచే బొగ్గును తస్కరించడం ఎక్కువైపోయినట్లు తెలుస్తోంది. బొగ్గు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అక్రమార్కులు సగటున రోజుకు రూ.1.5 లక్షల నుంచి రూ.3లక్షల విలువైన బొగ్గు చౌర్యం కోసం కూలీలకు పెట్టుబడి పెడుతున్నట్టు తెలుస్తోంది. సుమారు 200 మంది కూలీలకు రోజుకు రూ.500 నుంచి రూ.750 కూలి చెల్లించి ఎన్‌టీపీసీకి బొగ్గు రవాణా చేస్తున్న రైల్‌ వ్యాగన్ల నుంచి 5 కిలోమీటర్ల పొడవునా బొగ్గును డంపింగ్‌ చేయిస్తున్నారనే అరోపణలున్నాయి. రామ గుండం థర్మల్‌ స్టేషన్‌కు విద్యుత్‌ ఉత్పాదన కోసం ప్రతిరోజూ సుమారు రెండు రేకులు అంటే.. 40 వేల టన్నుల బొగ్గు అవసరమవుతుంది. దానికి అవసర మైన బొగ్గు నిల్వలు రామగుండం పరిధిలోని ఒపెన్‌ కాస్ట్‌ 1, 2 ద్వారా సరఫరా చేస్తున్నారు. రోజుకు మూడు రైళ్ల ద్వారా ఈ పరిమాణాన్ని ఎన్‌టీపీసీకి రవాణా చేస్తున్నారు. అయితే అక్రమ బొగ్గు వ్యాపారం లో ఆరితేరిన బెల్లంపల్లికి చెందిన వ్యాపారి కూలీలను వినియోగించి ఎల్కలపల్లి గేట్‌, లక్ష్మీపూర్‌, సెంటిన రికాలనీల్లో రైల్వే వ్యాగన్ల నుంచి బొగ్గు కిందపడేసి సంచుల్లో నింపి చెట్లపొదల్లో దాచిపెట్టి రాత్రి కాగానే బొగ్గు నిల్వలను లారీల్లోకి మార్చి రాష్ట్ర రాజధాని సమీపంలోని వివిధ రకాల పరిశ్రమలు, ఫెర్రోఅల్లా యిలకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది. అదనంగా కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఇటుక బట్టీల వ్యాపారులకు టన్నుకు రూ.1,500 నుంచి రూ.1,700 చొప్పున విక్రయి స్తున్నట్లు గుర్తించారు. నిజానికి ఆయా సంస్థలు సింగరేణి నుంచి నేరుగా బొగ్గును కొనుగోలు చేసుకునే వెసులుబాటున్నా స్మగ్లర్లు చౌర్యం చేసిన బొగ్గు అతి తక్కు వ ధరలకు లభిస్తుం డటంతో దొడ్డిదారిన వస్తున్న దానిని కొనేందుకు అసక్తి చూపుతున్నారని అంగున్నా రు. దీంతో ఈ అక్రమ వ్యాపారం ‘మూడు పువ్వులు ఆరు కాయలు’ చందంగా వర్థిల్లుతోందన్న చర్చ జరు గుతోంది. ఇందులో బెల్లంపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఆరితేరాడన్న అరోపణలున్నాయి. ఆ వ్యాపారి తన అక్రమానికి అడ్డు తగలకుండా స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీసులకు ప్రతినెలా నజరానాగా భారీ మొత్తంలో సొమ్ములు ముట్టజెబుతున్నట్టు తెలు స్తోంది. ‘కంచే చేను మేసింది’ అన్నట్టు సాక్షాత్తు సింగ రేణికి చెందిన అధికారులకు కూడా ఈ పాపంలో వాటాలు అందు తున్నాయన్న అరోపణలున్నాయి. అలాగే సింగరేణి ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బందికి కూడా నెలనెలా మామూళ్లు ముట్ట చెబుతున్నారన్నట్లు తెలుస్తోంది. రామగుండం ప్రాం తం లోని ఓసీపీ-2 డంప్‌ యార్డు నుంచే బొగ్గు చౌర్యం అధికంగా జరుగుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన సంబంధిత పోలీస్‌ అధికారులు గానీ, సింగరేణి యాజమాన్యం కానీ పట్టించుకునే పరిస్థితి లేదం టున్నారు. పైగా బొగ్గు అక్రమ డంపింగ్‌కు సంబంధించి ముఠాల సమాచారం ముందుగానే ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించే పోలీసు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందిస్తారని, దీనివల్ల దొంగతనం జరుగుతున్నప్పుడు పోలీసులు ఆ ప్రాంతాల వైపు కన్నెత్తికూడా చూడరని స్థానికులు చెబుతుండడం గమనార్హం. దీంతో సగటున రోజుకు కనీసం రెండు, మూడు లారీలైనా చౌర్యం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ప్రాంతంలో బొగ్గు చౌర్యం కొత్త కాకపోయినా జార్ఖండ్‌ తరహాలో మాఫియా ముఠా సంస్కృతి పెరుగుతుండటమే ఆందోళన కలిగించే విషయం. జార్ఖండ్‌లోని బొగ్గు గనులు రాజకీయ నేతల కనుసన్నల్లోనే పనిచేస్తాయి. అక్కడ వాస్తవిక బొగ్గు ఉత్పత్తిలో దాదాపు 35 శాతం బొగున్గు మాఫియా తస్కరించి సొమ్ము చేసుకుంటోంది. అక్కడి గనులన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉండటం, నక్సల్‌ సమస్య అధికంగా ఉండటం లాంటి అంశాల నేపథ్యంలో అక్కడ నియంత్రణ లేదని చెబుతున్నారు. అక్కడి ప్రభుత్వం బొగ్గు మాఫియా ముఠాలపై చర్యలు తీసుకోలేకపోతోందని, దీంతో దశాబ్ద కాలంగా చిన్నచిన్న దొంగతనాలతో కార్యకలాపాలు నెరిపిన ముఠాలు ఆయుధాలు సంపాదించి సమాంతర వ్యవస్థనే నడుపుతున్నాయని సమాచారం. తాజాగా ఈ ప్రాంతంలోనూ అదే తరహా కోల్‌స్మగ్లింగ్‌ ముఠాల సంస్కృతి పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమేనని అంటున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో బొగ్గును తస్కరించే క్రమంలో కూలీలు ప్రమాదవశాత్తు రైలు కిందపడి మరణిస్తున్న సంఘటనలు తరచుగా జరుగుతున్నాయంటున్నారు. అంతేకాదు బొగ్గును తస్కరిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అవయవాలు కోల్పోయి జీవశ్చవాలుగా బతుకులీడుస్తున్న కూలీలు రామగుండం ప్రాంతంలో చాలా మంది కనిపిస్తారు.

ఏడాదికి సగటున 150కి పైగా బొగ్గు తస్కరణ కేసులు...

సింగరేణి సంస్థ పరిధిలోని కొత్తగూడెం, ఇల్లెందు, భూపాలపల్లి రామగుండం, శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి (గోలేటి) ప్రాంతాల్లో గతేది కాలంలో దాదాపు 150కి పైగా బొగ్గు తస్కరణ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. అంటే ఒక్కో ఏరియాలో సగటున నెలకు 10కి తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయని అంచనా. అయితే ఇవన్నీ కూడా చిన్నచిన్న కేసులేనని సంస్థకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బొగ్గు తస్కరణ కేసులు ఎక్కువగా భూపాలపల్లి, బెల్లంపల్లి, రామగుండం, ఎన్టీపీసీ ప్రాంతాల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. సగటున ఒక ఏడాదికి ఒక్కో ఏరియాలో రూ.10 కోట్ల విలువైన బొగ్గు స్మగ్లర్ల బారిన పడుతున్నట్టు చెబుతున్నారు. ఇటీవల భూపాలపల్లి ఓసీపీ 1 నుంచి రామగుండం ఆర్‌జి- 3కి తరలిస్తుండగా స్మగ్లర్లు అత్యంత చాకచక్యంగా వాహనాలకున్న జీపీఎస్‌ ట్రాకర్లను మార్చి లారీల్లోని సగం బొగ్గును ఇటుక బట్టీలు, రహస్య ప్రాంతాల్లో డంపు చేసినట్లు విజిలెన్స్‌ గుర్తించింది. పక్కా సమాచారంతో జరిపిన దాడుల్లో ఒక ఇటుక బట్టీలోనే దాదాపు 200 టన్నుల బొగ్గు నిల్వలను కనుగొనడం ఈ ప్రాంతంలో జరుగుతున్న బొగ్గు స్మగ్లింగ్‌ దందాకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం 227 కేసులే నమోదైనట్టు సింగరేణి విజిలెన్స్‌ అధికారులు చెబుతున్నా ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? ఎంత బొగ్గు పట్టుబడింది అన్న ప్రశ్నలకు మాత్రం అధికారుల నుంచి సమాధానం కరువైంది. ఇదే విషయమై జీఎం విజిలెన్స్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించడం లేదు.

Updated Date - Mar 12 , 2024 | 11:47 PM