Share News

జల పరీక్ష.. ఆరోగ్య రక్ష

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:25 AM

మనం రోజువారీ తాగే నీ రు పరిశుభ్రంగా లేకపోతే అనేక రోగాలు వచ్చే అవకా శం ఉంటుంది. స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం అమల్లోకి తెచ్చింది. కానీ పైపులైన్లు, గేట్‌వాల్వ్‌ లీకేజీలు, నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయకపోవడం వం టి కారణాల వల్ల శుద్ధజలం కలుషితమవుతోంది.

జల పరీక్ష.. ఆరోగ్య రక్ష
జఫర్‌గడ్‌ మండలం సాగరంలో నీటి నాణ్యత పరీక్షలు చేస్తున్న జీపీ సిబ్బంది

తాగునీటికి నాణ్యత పరీక్షలు

కలుషిత నివారణకు సర్కార్‌ చర్యలు

గ్రామ పంచాయతీలకు క్లోరోస్కోప్‌ కిట్ల పంపిణీ

ప్రతీ రోజు మూడు చోట్ల క్వాలిటీ టెస్టులు

నిర్వహణపై శిక్షణ

వ్యాఽధులను కట్టడి చేయడమే లక్ష్యం

జఫర్‌గడ్‌, ఏప్రిల్‌ 24 : మనం రోజువారీ తాగే నీ రు పరిశుభ్రంగా లేకపోతే అనేక రోగాలు వచ్చే అవకా శం ఉంటుంది. స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ పథకం అమల్లోకి తెచ్చింది. కానీ పైపులైన్లు, గేట్‌వాల్వ్‌ లీకేజీలు, నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయకపోవడం వం టి కారణాల వల్ల శుద్ధజలం కలుషితమవుతోంది. దీని కి తోడు కొన్ని చోట్ల బోర్లు, చేతిపంపులు, రక్షిత మంచినీటి బావుల నుంచి ట్యాంకులకు నీటిని నేరుగా సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటుతూండడంతో బోర్లు, బావుల్లో నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తాగునీరు కలుషితం కాకుండా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అం దించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నీటి నా ణ్యత తెలుసుకునేందుకు నీటి పరీక్షల నిర్వహణ ప్రక్రియకు జిల్లాలో ఇటీవల శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందుకు అవసరమైన కిట్లను (క్లోరోస్కోప్‌ కిట్లు) సంబంధిత అఽధికారులు ఆయా గ్రామ పంచాయతీలకు పంపిణీ చేశారు. నీటి పరీక్షలు ఏ విధంగా చేయాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, మిషన్‌ భగీరథ అధికారులు పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు. క్షేత్ర స్థాయిలో కార్యదర్శులు నాణ్యత పరీక్షలు చేస్తున్నారు.

ప్రతీ గ్రామ పంచాయతీకి కిట్‌ అందజేత..

జిల్లాలోని 12 మండలాల పరిధిలో మొత్తం 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామాల జనాభా మొత్తానికి స్థానికంగా ఉండే నీటి ట్యాంకులు, ప్రత్యేకంగా నిర్మించిన ట్యాంకుల ద్వారా మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతోంది. అయితే ట్యాంకులను ప్రతి నెలా మూడు సార్లు శుభ్రం చేయాల్సి ఉండగా, చాలా చోట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే తరచూ ఏదో ఒక చోట పైపుల లీకేజీ జరుగుతోంది. ఫలితంగా అపరిశుభ్ర నీరు సరఫరా అవుతున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో నీటి నాణ్యతను పరీక్షించేందుకు ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక క్లోరోస్కోప్‌ కిట్‌ చొప్పున అందజేశారు. ఒక్కో కిట్‌లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించేందుకు రసాయనాలు, పరీక్ష నాళిక, నాణ్యతను సూచించే పత్రం, ఒక స్టాండ్‌, శుభ్రం చేసేందుకు బ్రష్‌లు ఉన్నాయి.

వ్యాధుల నివారణకు దోహదం...

భగీరథ పేరుతో ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తున్నారు. నల్లాల ద్వారా భగీరథ నీళ్లనే సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం, అఽధికారులు చెబుతున్నా.. కొన్ని గ్రామాల్లో స్థానిక బోరు బావుల నీటిని సైతం భగీరథ నీళ్లతో పాటు సరఫరా చేస్తున్నారు. అక్కడక్కడా పైపులైన్‌ లీకేజీలు, నిర్వహణ లోపాలు, స్థానిక బోరు బావుల నీరు కలిసిపోవడంతో కలుషితమమ్యే అవకాశం ఏర్పడింది. గ్రామాల్లో కలుషిత నీటి కారణంగా వ్యాధులు వ్యాపిస్తుండగా, ఒక్కోసారి అతిసారం కారణంగా అస్వస్థతకు గురవుతుంటారు. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాల్లోని ప్రతీ నీటి వనరుని పరీక్షించాల్సి ఉంటుంది. ఆ నీరు తాగడానికి అనుకూలంగా ఉందా..? అనే విషయాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నీటి పరీక్షల వల్ల ప్రజలకు శుద్ధ నీరు సరఫరా అయి వ్యాధుల నియంత్రణకు దోహదపడుతుంది.

నాణ్యత లోపిస్తే ప్రత్యామ్నాయ చర్యలు..

గ్రిడ్‌ ద్వారా ట్యాంకుల్లోకి నీరు చేరుతుంది. మొదట కిట్టుతో ట్యాంకు వద్ద నీటిని పరీక్షిస్తారు. మళ్లీ గ్రామంలోని మధ్యలో నల్లా వద్ద, చివరి ఇంటి నల్లా వద్ద నమూనాలు సేకరించి నీటి నాణ్యత పరీక్షలు చేస్తారు. ఆ వివరాలను ఎప్పటికపుడు రిజిస్టర్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. నాణ్యతా లోపం ఉందని నిర్ధారణకు వస్తే సంబంధిత అధికారులకు తెలియజేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రకియ నిరంతరం కొనసాగుతుంది.

వినియోగిస్తేనే ప్రయోజనం..

కిట్లతో నీటి నాణ్యత పరీక్షలు చేయడంతో ప్రజలకు శుద్ధ నీరు అందే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని రోజులు చేసి మూలన పడేస్తే ప్రభుత్వ ఉద్దేశం మూలన పడుతుంది. గతంలో నీటి నాణ్యత పరీక్షల కిట్లు ఆర్భాటంగా పంపిణీ చేసినా.. వాటిని సరిగా వినియోగించలేదన్న విమర్శలు ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శులు, బిల్‌ కలెక్టర్‌లు, కారోబార్లు వీటిపై దృష్టి సారించాల్సి ఉండగా.. అప్పట్లో చాలా చోట్ల నిర్లక్ష్యంగా వదిలేశారు. ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. వేసవితో తాగునీటి కష్టాలు ఆరంభమయ్యయి. ఈ సారి గతంలో వలె కాకుండా పక్కాగా నిర్వహిస్తే ప్రజలకు స్వచ్ఛ జలం సరఫరా చేయడంతో పాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. నీటి పరీక్షలు నిరంతరం జరిగేలా ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

శుద్ధ జలం అందించడమే లక్ష్యం..

శ్రీకాంత్‌, ఈఈ, ఆర్‌డబ్ల్యుఎస్‌ (మిషన్‌ భగీరథ), జనగామ జిల్లా ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించడమే లక్ష్యం. ఇందుకోసం గ్రామాల్లో మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నాం. అయితే లీకేజీలు, ట్యాంకులను శుభ్రపరచకపోవడం, క్లోరినేషన్‌ చేయకపోవడం, స్థానిక నీటి వనరుల వాడకం వంటి కారణాల వల్ల కలుషిత నీరు చేరకుండా.. స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం నీటి నాణ్యత పరీక్షల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటి పరీక్షల కోసం ప్రతీ గ్రామ పంచాయతీకి క్లోరోస్కోప్‌ కిట్లను అందించాం. నాణ్యత పరీక్షలు చేసే విధానంపై గ్రామ కార్యదర్శులకు అవగాహన కల్పించాం. ప్రతీ రోజు గ్రామంలో మూడు చోట్ల నీటి పరీక్షలు నిర్వహించి.. విధిగా రిజిస్టర్‌లో నమోదు చేస్తాం. నీటి నాణ్యతలో లోపాలు ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే పరిశుభ్రమైన నీటిని సరఫరా చేసేందుకు ఆయా గ్రామ పంచాయతీలు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతాయి.

Updated Date - Apr 25 , 2024 | 12:25 AM