Share News

భగభగ..

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:18 AM

ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో సగటు న 40 డిగ్రీలకు పైనే నమోదవుతుండ టం, వడగాలులు, ఉక్కపోత ప్రారంభం కావడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉ దయం 9గంటలకే సూరీడు సుర్రుమం టుండగా.. మధ్యాహ్నం సమయంలో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకు తున్నారు. దీంతో రహదారులు నిర్మాను ష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు వెలవెలబోతున్నాయి. గతేడాది కన్నా ఈ సారి ఎండలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. మార్చిలో పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 38 డిగ్రీలు నమోదవగా.. ఏప్రిల్‌లో తీవ్రత పెరుగుతూ వ స్తోంది. గురువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్యధి క ప్రగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకుంది.

భగభగ..

ఠారెత్తిస్తున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి

ఉమ్మడిజిల్లాలో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధికం

బొగ్గుగని ప్రాంతాల్లో మరింత వేడిమి

ఆరెంజ్‌ అలర్ట్‌ జారీతో యంత్రాంగాలు అప్రమత్తం

హనుమకొండ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి) : ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో సగటు న 40 డిగ్రీలకు పైనే నమోదవుతుండ టం, వడగాలులు, ఉక్కపోత ప్రారంభం కావడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉ దయం 9గంటలకే సూరీడు సుర్రుమం టుండగా.. మధ్యాహ్నం సమయంలో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకు తున్నారు. దీంతో రహదారులు నిర్మాను ష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కూడళ్లు వెలవెలబోతున్నాయి. గతేడాది కన్నా ఈ సారి ఎండలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండగా.. మార్చిలో పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 38 డిగ్రీలు నమోదవగా.. ఏప్రిల్‌లో తీవ్రత పెరుగుతూ వ స్తోంది. గురువారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్యధి క ప్రగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకుంది. అత్యధికంగా ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.1 డిగ్రీలు నమోదైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లో 41డిగ్రీలు, జనగామ జిల్లాలో 40.5డిగ్రీలు, వరంగల్‌ జిల్లా లో 40.3 డిగ్రీలు, హనుమకొండ జిల్లాలో కాస్త తక్కువగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో ములుగులో మరింతగా 42.9డిగ్రీలు, 42.3డిగ్రీ లు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 42.6డిగ్రీలు, జన గామలో 41.6డిగ్రీలు, వరంగల్‌లో 41.7డిగ్రీలు, హను మకొండలో 41.5 డిగ్రీలకు పెరగొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండలు పెరుగుతుండటంతో జన సంచారం లేక రోడ్ల పక్కన చిరువ్యాపారాలు మంద గించాయి. దీంతో ఆ పేద, చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, మజ్జిగ, అంబలి, సోడ తదితర పానీయాలకు డిమాండ్‌ పెరిగింది.

పెరుగుతున్న వడదెబ్బ బాధితుల సంఖ్య

ఎండల తీవ్రత, ఉక్కపోత, వడగాలుల వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, అందు వల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే వడదెబ్బబారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా బయట పనులకు వెళ్లే కార్మికులు, ఉపాధి కూలీలు ఎక్కువగా అనారోగ్యం పాలవుతున్నారు. ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధడుతున్నవారు అస్వస్థతకు గురవుతున్నారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వేసవి కాలంలో వచ్చే వ్యాధులపై పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌లను ఏర్పాటు చేసి ఎండబాధితులకు తక్షణ వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉచితంగా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు.

నిప్పుల కుంపటిగా బొగ్గుగనులు..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరిధిలోని బొగ్గుగని ప్రాంతా లైన భూపాలపల్లి టౌన్‌, తాడిచెర్ల, గణపురం మండలంలోని మాధవరావుపల్లె ఓపెన్‌ కాస్ట్‌లు, వాటి పరిసరాలు నిప్పుల కుంప టిని తలపిస్తున్నాయి. సహజంగా బొగ్గునిల్వలు, ఓపెన్‌కాస్ట్‌లు ఉన్న చోట వేడిమి ఎక్కువగా ఉంటుంది. దీని కితోడు ఎండలు మండిపోతుండడంతో స్థానికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు ఇలాగే పెరుగుతూ పోతే నీటితో ఈ ప్రాంతాలను చ ల్లబరచాల్సి ఉంటుంది. అలాగే సిబ్బందికి సెలవులు ప్రకటించాల్సి న పరిస్థితి వస్తుంది. ఉద్యోగులకు మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. బయట 40 డిగ్రీలు ఉంటే ఓపెన్‌ కాస్ట్‌లలో 45 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉండటంతో సంస్థ అధికారులను అప్రమత్తం చేస్తోంది.

అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తత అవసరం

ఎండల తీవ్రతతో ఉమ్మడి జిల్లాలో తరుచూ అగ్ని ప్ర మాదాలు జరుగుతున్నాయి. వేసవి వేళ సంభవించే ఈ అగ్రిప్రమాదాల పట్ల అప్రమత్తం గా ఉండాలి. రహదారుల వెంట పేరుకుపోతున్న చెత్త, రాలిన ఎండు ఆకులు, ప్లాస్టిక్‌ వ్యర్థాలను పారిశుధ్య కార్మికులు తొలగించడం లేదు. దీంతో తాగిపడేసిన బీడి, సిగరెట్‌ పీకల ద్వారా మంటలు అంటుకుంటున్నాయి. అలాగే ఏసీలు, కూలర్లు వినియోగం ఎక్కువడంతో సామర్థ్యానికి మించి వి ద్యుత్‌ వాడకం పెరిగి షార్ట్‌సర్యూట్‌ జరిగి అగ్నిప్ర మాదాలు జరుగుతున్నాయి. ఇటీవల వరంగల్‌ పోచ మ్మమైదాన్‌లోని ఒక షాపింగ్‌ కాంప్లెక్సులో షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల భారీ అగ్నిప్రమాదం జరిగిం ది తెలిసిందే. ములుగులో ఎండ తీవ్రత వల్ల ఏజె న్సీ ప్రాంతంలోని అడవిలో కార్చిచ్చు చెలరేగింది.

వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వడదెబ్బకు గురైనప్పుడు శరీర ఉష్ణోగ్రత తీవ్రం గా పెరగడం, తీవ్రమైన తలనొప్పి, నాలుక ఎండి పోవడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, మూ త్రం గాఢ పసుపు రంగులో ఉండి మంట రావ టం, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితిలోకి వెళ్లే లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడ ప్రదేశానికి చేర్చాలి. శరీరాన్ని చల్లని నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. ఎండదెబ్బ తగిలినవారికి ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగించాలి. సత్వర చర్యల కోసం 108 అత్యవసర సేవలను సంప్రదించాలి. ప్రథమ చికిత్స తర్వాత ఆసుపత్రులకు తరలించాలి. అయితే ఎండ త్రీవంగా ఉన్నప్పుడు బయట తిరగడం, ఆటలాడటం చేయొద్దు. తప్పనిసరి అయితే గొడుగు, టోపీ, తెల్లని రుమాలు ధరించాలి. నీరు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మత్తుపానీయాలు తీసుకోవద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. బయట పనికి వెళ్లేవారు ఉదయం, సాయంత్రం వేళల్లో పని చేసుకొని మధ్యాహ్న సమయలో విశ్రాంతి తీసుకోవాలి.

Updated Date - Apr 05 , 2024 | 12:18 AM