Share News

స్కూళ్లు జిగేల్‌

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:13 PM

జిల్లాలోని బడులకు సౌర సొబగులు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. పలు పాఠశాలల్లో సౌరశక్తి ద్వారా సోలార్‌ పవర్‌ను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో) ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్‌ స్కూళ్లల్లో సౌరశక్తిని ఉపయోగించుకొని, నిరం తరం కరంట్‌ సరఫరా అందించడంతో పాటు బిల్లుల భారాన్ని తొలగించేందుకు సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.

స్కూళ్లు జిగేల్‌
ఇనుగుర్తి హైస్కూల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానళ్లు

పాఠశాలలకు ‘సౌరశక్తి’

సోలార్‌ పవర్‌తో బడులకు తగ్గనున్న కరెంట్‌ బిల్లుల భారం

మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయంతో ఆదాయం

డిజిటల్‌ తరగతుల బోధనకు ఊతం

జిల్లా వ్యాప్తంగా 151 బడుల్లో ఏర్పాటు

కేసముద్రం, ఏప్రిల్‌ 14 : జిల్లాలోని బడులకు సౌర సొబగులు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. పలు పాఠశాలల్లో సౌరశక్తి ద్వారా సోలార్‌ పవర్‌ను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో) ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్‌ స్కూళ్లల్లో సౌరశక్తిని ఉపయోగించుకొని, నిరం తరం కరంట్‌ సరఫరా అందించడంతో పాటు బిల్లుల భారాన్ని తొలగించేందుకు సోలార్‌ విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. సౌరశక్తి ద్వారా వచ్చే కరెంట్‌తో పాఠశాలల్లో విద్యుత్‌ బిల్లుల కష్టాలు తీరనున్నాయి.

మహబూబాబాద్‌ జిల్లాలో మొత్తం 898 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 676 ప్రాథ మిక, 120 ప్రాథమికోన్నత, 102 ఉన్నత పాఠశాలలున్నాయి. కాగా, 151 బడుల్లో సోలార్‌ పవర్‌ సిస్టంలను ఏర్పాటు చేశారు. ఇందులో 40 ప్రాథమిక పాఠశాలలుండగా 23 ప్రాథమికోన్నత, 88 హైస్కూళ్లలో సౌర విద్యుత్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. 136 పాఠశాలల్లో ఏడాది క్రితమే సోలార్‌ పవర్‌ యూనిట్లను బిగించగా, కొద్దినెలలుగా మిగ తా పాఠశాలల్లో ఈ యూనిట్లను బిగించే కార్యక్రమం కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్కో) ఆధ్వర్యంలో సోలార్‌ పవర్‌ సిస్టంలను పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యుత్‌ బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బం దులు పడు తున్న దాఖలాలు లేకపోలేదు. ఈ క్రమంలో సోలార్‌ విద్యుత్‌ యూనిట్ల ఏర్పాటుతో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి.

బహుళ ప్రయోజనాలు..

పాఠశాలల్లో సౌరశక్తిని ఉపయోగించి విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థల ఏర్పాటు ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నా యి. ఇతర సహజ వనరులను ఉపయోగించకుండా సూ ర్యుని శక్తి నుంచే విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ఇందులో ప్రధాన ప్రయోజనం. సాధారణంగా విద్యుత్‌ను థర్మల్‌, అణు, జల విద్యుత్‌లలో బొగ్గు, నీరు, తదితర ఇంధనాలను ఉపయోగించాల్సిఉంటుంది. సోలార్‌ పవర్‌లో ఎలాంటి ఇంధనం ఉపయోగించకుండానే విద్యుత్‌ లభిస్తుంది. పాఠ శాలల్లో సౌరశక్తిని ఉపయోగించడంవల్ల పర్యావరణ స్పృ హతో కూడిన అభ్యాసాలను విద్యార్థుల్లో ప్రోత్సహించినట్ల వుతుంది. కాలుష్యం లేకుండా గ్లోబర్‌ వార్మింగ్‌ ప్రభావాల ను అరికట్టగల సామర్థ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానళ్లు నిలుస్తున్నాయి.

పెరుగుతున్న విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించడమేకా కుండా మిగులు విద్యుత్‌ను విక్రయించే అవకాశం కూడా ఉంది. సోలార్‌ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను పాఠశాల అవసరాలకు వినియోగించగా మిగిలిన విద్యుత్‌ ను పవర్‌ గ్రిడ్‌కు బదిలీ(విక్రయం) చేస్తారు. విద్యుత్‌ గ్రిడ్‌ ద్వారా ప్రజలకు సరఫరా చేస్తారు. ఇలా విక్రయించిన వి ద్యుత్‌కు యూనిట్ల వారీగా లెక్కించి పాఠశా లకే తిరిగి విద్యుత్‌ సంస్థలు డబ్బులు చెల్లిస్తా యి. తద్వారా విద్యుత్‌ విక్రయంతో పాఠశాల లకు ఆదాయం సమకూరి నిర్వహణ ఖర్చుల కు చేదోడువాదోడుగా ఉంటుంది. అంతే కా కుండా పాఠశాలల్లో నూత నంగా అమలు చేస్తున్న డిజిటల్‌ క్లాస్‌లలో భాగంగా ఏర్పా టు చేసిన ఇంటరాక్టీవ్‌ ఫ్లాట్‌ ప్యానల్‌లకు నిరంతర విద్యుత్‌ను అందించి తరగతులను ఆటంకం లేకుండా నిర్వహించే వీలుంది.

ఉన్నత పాఠశాలలకు 2 కిలోవాట్స్‌..

సోలార్‌ పవర్‌ యూనిట్లు పాఠశాలల స్థాయిని బట్టి వాటి సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్‌ పవర్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలలకైతే 1 కిలోవాట్‌ ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. గత ఏడాది ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 136 ప్రభుత్వ పాఠశాలల్లో సౌర విద్యుత్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు. తొలిదశలో 250 మందికిపైగా విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలలకు ప్రాధాన్యతనిచ్చారు. ఆయా పాఠశాలల్లో 2 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్ప త్తి యూనిట్‌ ద్వారా ప్రతీరోజు 8 నుంచి 10 యూనిట్ల పవర్‌ వచ్చే విధంగా 6 ప్యానల్‌ బోర్డులు, ఇన్వర్టర్‌లను 25 సంవత్సరాల వారంటీతో ఏర్పాటు చేశారు.

ఈ యూనిట్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను పాఠశాల అవసరాలకు వినియోగించి మిగులు కరెంటును పవర్‌ గ్రిడ్‌కు సరఫరా చేస్తారు. అంటే సాధారణ విద్యుత్‌ లైనులోకి రివర్స్‌గా పంపిస్తారు. ఇందుకోసం ఒక విద్యుత్‌ మీటర్‌ను ఏర్పాటు చేసి ఎంత విద్యుత్‌ను పవర్‌ గ్రిడ్‌కు ఇచ్చారనే విషయాన్ని యూనిట్‌ చొప్పున లెక్కించి ఆయా పాఠశాలలకు డబ్బులను విద్యుత్‌ సంస్థలు చెల్లిస్తాయి. ఒక్కో సోలార్‌ యూనిట్‌ ద్వారా నెలకు 250 నుంచి 300 యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుండగా పాఠశాలలకు సెలవు దినాలు, వేసవి సెలవులు, చలి, వానాకాలంలో విద్యుత్‌ వినియోగం తగ్గి, మిగులు విద్యుత్‌ను ఎన్‌పీడీసీఎల్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కేసముద్రం మండలంలోని ఒక హైస్కూల్‌కు రూ.2 వేల బిల్లు వస్తుండగా సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ ఏర్పాటు చేసిన అనంతరం రూ.200లకు దాటలేదని ఒక ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ఏదేమైనా సోలార్‌ విద్యుత్‌ యూనిట్ల ఏర్పాటుతో పాఠశాలల నిర్వహణ, బోధన విధానాల్లో నూతన విప్లవాన్ని తీసుకువస్తుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలలపై బిల్లుల భారం తగ్గుతుంది : బీరం జనార్ధన్‌రెడ్డి, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు, కేసముద్రం

సోలార్‌ విద్యుత్‌ యూనిట్ల ఏర్పాటుతో పాఠశాలలపై విద్యుత్‌ బిల్లులు భారం తగ్గుతుంది. పాఠశాల నిర్వహణ ఖర్చుల్లో అధిక భాగం విద్యుత్‌కే వినియోగించాల్సి ఉంటుంది. సౌర విద్యుత్‌తో బిల్లులు చెల్లించే బాధలు తప్పడమేకాకుండా పాఠశాలకే ఆదాయం వస్తుంది. తద్వారా స్కూళ్ల నిర్వహణ ఖర్చులకు మరింత చేయూతనిచ్చినట్లవుతుంది.

Updated Date - Apr 14 , 2024 | 11:13 PM