Share News

సమస్యలపై ఏకరువు

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:29 PM

మానుకోట మునిసిపల్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పాలకమండలి సమావేశంలో కౌ న్సిలర్లు సమస్యలపై ఏకరువు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక.. తొలిసారిగా నిర్వహించిన ము నిసిపల్‌ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సమస్యలపై ఏకరువు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

మునిసిపల్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లిన సభ్యులు

కార్యాలయంలో సరిపడ సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నామని వెల్లడి

మానుకోట పట్టణంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి : బీఆర్‌ఎస్‌

ఎస్డీఎఫ్‌ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేయించాలని విజ్ఞప్తి

పట్టణాభివృద్ధి కోసం కలిసికట్టుగా పని చేద్దాం : ఎమ్మెల్యే మురళీనాయక్‌

మహబూబాబాద్‌ టౌన్‌, జనవరి 12 : మానుకోట మునిసిపల్‌ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పాలకమండలి సమావేశంలో కౌ న్సిలర్లు సమస్యలపై ఏకరువు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక.. తొలిసారిగా నిర్వహించిన ము నిసిపల్‌ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహబూబా బాద్‌ ఎమ్మెల్యేగా భూక్య మురళీనాయక్‌ గెలిచిన తర్వాత, జరిగిన ఈ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లు స మస్యలను వివరించి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్క రించే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్లు, కౌన్సిలర్లు మానుకోట పట్టణంలో నెలకొన్న సమస్యలను వివ రించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎస్డీఎఫ్‌ నిధులు రూ.50 కోట్లను మంజూరు చేయించి, తీసుకువచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

పెండింగ్‌లో పనుల బిల్లులు..

మానుకోట మునిసిపల్‌ పాలకమండలి సమావేశంలో తొలుత చై ర్మన్‌ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి పలు అంశాలను ఎమ్మెల్యే మురళీ నాయక్‌, ఎమ్మెల్సీ రవీందర్‌రావు దృష్టికి తీసుకువచ్చారు. కార్యాలయం లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సరిపడ ఉద్యోగులను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మునిసిపాలిటీలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. బస్డాండ్‌ సెంటర్‌ నుంచి ఈదులపూసపల్లి వరకు, నెహ్రూసెంటర్‌ నుంచి పత్తిపాక వరక రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా ఆర్వోబీ, రింగ్‌ రోడ్డు ను సాధించే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎం ఫ్లోర్‌ లీడర్‌ సూర్నపు సోమయ్య మాట్లాడుతూ పేదల ఇళ్లకు పట్టాలిచ్చి, ఇంటి నెంబర్లు కేటాయించాలని, జీవో నెంబ రు 58 ద్వారా పట్టాలందించాలని కోరారు. మునిసిపాలిటీకి రావాల్సిన పట్టణ ప్రగతి ని ధులు పెండింగ్‌లో ఉన్నాయని, గత సంవ త్సర కాలంగా రావడంలేదని గుర్తు చేశారు.

బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌లీడర్‌ చిట్యాల జనార్దన్‌ మాట్లాడుతూ నిజాం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గతంలో నిధులు మంజూరు అయ్యాయని, అయితే ఏ కార ణం చేతనో గాని పనులు నిలిచిపోయా యని పేర్కొన్నారు. గోపాలపురం రోడ్డును వెడల్పు చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీ డర్‌ వెన్నం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎస్డీఎఫ్‌ నిధులు రూ.50 కోట్లు తీసుకువచ్చి అందులో మునిసిపాలిటీలో విలీనమైన గ్రామాలకు ఒక్కొక్కదానికి రూ.కోటి నిఽధులు కేటాయించాల న్నారు. సీపీఐ ఫ్లోర్‌లీడర్‌ అజయ్‌సారథిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నెంబరు 122 ద్వారా తీసుకువచ్చిన నూతన మునిసిపల్‌ చట్టంతో కౌన్సిలర్లు ఉత్సవవిగ్రహాలుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబరు 34 ద్వారా మాజీ సీఎం కేసీఆర్‌ ఎస్డీఎఫ్‌ నిధులు రూ.50 కోట్లు ప్రకటించి, మంజూరు ఇవ్వ లేదన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌ జీవో నెంబరు 367 ద్వారా పలు వార్డుల అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేసి, నేటికి విడుదల చే యలేదని ఈ మూడు జీవో ప్రతులను చించి వేశారు. తన వార్డు పరిధిలోని మూడుకొట్ల జంక్షన్‌ అభివృద్ధిలో నిర్లక్ష్యం చూపారని ఆయన మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ మార్నేని వెంకన్న మాట్లాడుతూ గ్రీన్‌ల్యాండ్‌లు అన్యాక్రాంతం కాకుండా చూడాలని, అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసు కోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ ఎడ్ల వేణు మాట్లాడుతూ పేదల గు డిసెలను కూల్చిన అధికారులు బడాబాబులు ఆక్రమించిన ప్రభుత్వ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవడం లే దని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిం చి, వెంచర్లు చేసి, ప్లాట్లుగా విక్రయిస్తున్న నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ హరిసింగ్‌ మా ట్లాడుతూ విలీన గ్రామాల అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయాలకు అతీతంగా కలిసి పని చేద్దాం : ఎమ్మెల్యే మురళీనాయక్‌

మానుకోట పట్టణాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని, రాజకీయాల కతీతంగా కలిసిక ట్టుగా పని చేద్దామని స్థానిక ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ పిలుపునిచ్చారు. ప్రతీనెల ముని సిపల్‌ పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఏప్పటికప్పుడు సమస్యలపై చర్చించి పరి ష్కారం చూపుదామన్నారు. ఆర్వోబీ మంజూరు విషయంలో ఆర్‌అండ్‌బీ మంత్రి వెంకట్‌రెడ్డితో మాట్లాడి సమస్యను వివరించానని తెలిపారు. కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెరువులకు హద్దులు నిర్ణయించి సుందరీకరణ గా తీర్చిదిద్దుదామన్నారు. పట్టణాభివృద్ధే లక్ష్యంగా డీపీఆర్‌ను తయారు చేయాలని సూచించారు.

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడు తూ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టణాభివృద్ది కోసం నివేదికలు తయారు చేయా లన్నారు. మునిసిపల్‌ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పొ మాట్లాడుతూ సమస్యలపై దృష్టి సారించి, పరిష్కారానికి కృషి చేస్తా మన్నా రు. పట్టణంలో అన్ని సైట్‌లను సందర్శించి, ప్రభు త్వ భూముల పరిరక్షణకు పాటు పడుతామ న్నారు. సర్కార్‌ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఏజెండా లోని పలు అంశాలపై చర్చించి తీర్మా నించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ ప్రసన్నారాణి, డీఈ ఉపేం దర్‌, ఏఈ సురేష్‌, టీపీవో నవీన్‌కుమార్‌, మెప్మా డీఎంసీ విజయ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 11:29 PM