Share News

పోరుకు సిద్ధం..

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:29 AM

జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం బిజీబిజీగా ఉంది. దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కాగా ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ వెలువడనుంది. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.

పోరుకు సిద్ధం..

పోలింగ్‌ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి

ఏప్రిల్‌ మొదటి వారంలో సిబ్బందికి శిక్షణ

ఓటు హక్కు ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు

జనగామ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో జిల్లా అధికార యంత్రాంగం బిజీబిజీగా ఉంది. దేశవ్యాప్తంగా 18వ లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల కాగా ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ వెలువడనుంది. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జనగామ జిల్లా పరిధిలో జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జనగామ అసెంబ్లీ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉండగా, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్‌(ఎస్సీ) పార్లమెంట్‌ నియో జకవర్గం పరిధిలో ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అటు వరంగల్‌ రిటర్నింగ్‌ అధికారి, ఇటు భువనగిరి రిటర్నింగ్‌ అధికారి పర్యవేక్ష ణలో జిల్లా అధికార యంత్రాంగం పనిచేయనుంది. ఎన్నికల పోలింగ్‌కు ఇంకా 47 రోజుల సమయం ఉండగా అధికారులు ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్నారు. పోలింగ్‌ సజావుగా సాగేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేందుకు గానూ జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసులు సవాల్‌గా తీసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నాటికే చేపట్టాల్సిన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అసిస్టెంట్‌ రిటర్నిం గ్‌ అధికారులను నియమించగా తాజాగా పోలింగ్‌ సిబ్బంది కేటాయింపునకు సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించారు.

పోలింగ్‌ సిబ్బంది ర్యాండమైజేషన్‌

ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన మొదటి విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియను జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తి చేసింది. పోలింగ్‌ విధు లు నిర్వర్తించే సిబ్బంది వివరా లను క్రోడీకరించి సిద్ధంగా ఉం చుకున్నారు. రెండో విడత ర్యాండమైజేషన్‌లో మండలాల వారీగా కేటాయింపులు జరుపుతారు. ఈ రెండో విడత ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ మొదటివారంలో జరగనుంది. రెండో విడత ర్యాండమైజేషన్‌ పూర్తి కాగానే నియోజకవర్గాల వారీగా కేటాయించిన సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ ఇచ్చినప్పటికీ ఎవరెవరికి ఏ పోలింగ్‌కేంద్రాన్ని అలాట్‌ చేసిన విషయాన్ని పోలింగ్‌ కు ఒక రోజు ముందుగానే చెబుతారు. సిబ్బందికి శిక్ష ణ పూర్తి కాగానే ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ ను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా మొదటి విడత లో కలెక్టరేట్‌ స్ట్రాంగ్‌రూమ్‌లో ఉన్న ఈవీఎంలను ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరిచి పనితీ రును పరిశీలిస్తారు. ఆ తర్వాత వాటిని నియోజకవ ర్గాల వారీగా పంపిస్తారు. నియోజకవర్గాల్లోని స్ట్రాం గ్‌రూముల్లో రెండో విడత ర్యాండమైజేషన్‌ చేసి పోలిం గ్‌కు ఒక రోజు ముందు కేంద్రాలకు తరలిస్తారు. ఈ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ ద్వారా జరుగుతుంది. ఈవీఎంల మొదటి విడత ర్యాండమేజేషన్‌ ప్రక్రియ నోటిఫికేషన్‌ వచ్చే ఏప్రిల్‌ 18 కంటే ముందు జరగనుంది. కాగా.. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు గానూ జిల్లా ఎన్నికల యంత్రాంగం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గ్రామాలు, మండలాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఓటు ఆవశ్యకతపై వివరిస్తున్నారు.

861 పోలింగ్‌ స్టేషన్లు.. 3444 పోలింగ్‌ సిబ్బంది..

- జనగామ జిల్లా పరిధిలోకి వచ్చే జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల పరిధిలో మొత్తంగా 861 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో జనగామలో 277, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 290, పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో 294 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. ఒక్కో పోలింగ్‌ స్టేషన్‌కు ప్రిసైడింగ్‌ అధికారి, సహాయ ప్రిసైడింగ్‌ అధికారితో పాటు మరో ఇద్దరు చొప్పున సిబ్బంది(అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్‌-ఓపీవో) నియమించనున్నారు. వీరితో పాటు మూడు నియోజకవర్గాలకు కలిపి 59 మంది మైక్రో అబ్జర్వర్లను నియమిం చనున్నారు. ఈ లెక్కన మూడు నియోజకవర్గాల పరిధిలోని 861 పోలింగ్‌ స్టేషన్లకు 3004 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించనున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:30 AM