Share News

పేదలపై పెత్తనం!

ABN , Publish Date - Apr 11 , 2024 | 11:29 PM

సంపాదనే పరమావధిగా కొందరు వడ్డీ వ్యాపారులు పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారు. తమ అవసరానికి ప్రైవే టు వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కిన పేదలు అధిక వడ్డీలు చెల్లించలేక.. వారి వలయం నుంచి బయటప డలేక విలవిల్లాడుతున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులకు అడ్డుచెప్పే వారు లేకపోవడంతో వారి ఆగడాలకు అం తు లేకుండా పోతోంది. కుటుంబ, ఇతర అవసరాల నిమిత్తం అప్పుగా డబ్బులు తీసుకున్న వారంతా అనే క ఇబ్బందులు పడుతున్నారు.

పేదలపై పెత్తనం!
భూపాలపల్లిలోని కృష్ణకాలనీలో ఓ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తున్న గణపురం ఎస్సై సాంబమూర్తి, సిబ్బంది.., కాటారంలో వడ్డీ వ్యాపారి ఇంట్లో పత్రాలను స్వాధీనం చేసుకుంటున్న సీఐ నాగార్జునరావు

జిల్లాలో హద్దుమీరుతోన్న వడ్డీ వ్యాపారం

ఎస్పీ ఆదేశాలతో ఏకకాలంలో దాడులు

12 మందిపై కేసులు నమోదు

రూ.3,71,240 నగదు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం

ముందే సర్దుకున్న మరికొందరు వ్యాపారులు

కృష్ణకాలనీ(భూపాలపల్లి), ఏప్రిల్‌ 11: సంపాదనే పరమావధిగా కొందరు వడ్డీ వ్యాపారులు పేదలపై పెత్తనం చెలాయిస్తున్నారు. తమ అవసరానికి ప్రైవే టు వడ్డీ వ్యాపారుల చేతికి చిక్కిన పేదలు అధిక వడ్డీలు చెల్లించలేక.. వారి వలయం నుంచి బయటప డలేక విలవిల్లాడుతున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల్లో వడ్డీ వ్యాపారులకు అడ్డుచెప్పే వారు లేకపోవడంతో వారి ఆగడాలకు అం తు లేకుండా పోతోంది. కుటుంబ, ఇతర అవసరాల నిమిత్తం అప్పుగా డబ్బులు తీసుకున్న వారంతా అనే క ఇబ్బందులు పడుతున్నారు. వారి నుంచి వ్యాపా రులు రూ.3 నుంచి రూ.10 వరకు వడ్డీ లాగుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇక నెలవారీ, రోజువారి కలెక్షన్ల పేరుతో వడ్డీకి డబ్బులిచ్చి రూ.కోట్లు గడిస్తున్నారు. వీరి ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు ఇళ్లు వదిలి వెళ్లిపోతుంటే.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవలే జిల్లా కేంద్రంలో ఓ వడ్డీ వ్యాపారి ఒత్తిడికి ఏడుకొండలు అనే చిరు వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు రావ డం, అది నిజమేనని పోలీసులు నిర్ధారించడం కలకలం రేపుతోంది. ఇదే సమయంలో జిల్లా పోలీసు శాఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే ఎస్పీ ఇచ్చిన ఆదేశాలతో జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఏకకాలంలో పోలీసులు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు చేయడం పట్ల చర ్చనీయాంశమైంది.

అందినకాడికి దండుకుంటూ..

జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. వడ్డీ వ్యాపారుల వద్దకు అప్పుకోసం వచ్చే వారి అవరాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వడ్డీ వసూలు చేస్తున్నారు. చిన్నచిన్న వ్యాపారులు, తోపు డుబండ్లు, తదితర వ్యాపారులు ఎక్కువగా ఏ రోజు కారోజు జరిగే వ్యాపారం మీద ఆధారపడి జీవిస్తుంటా రు. అలాంటి వారు పెట్టుబడి కోసం డైలీ ఫైనాన్స్‌ వారిని ఆశ్రయిస్తే ఉదయం రూ.900 ఇస్తే.. సాయం త్రం మళ్లీ తిరిగి రూ.1000 వసూలు చేస్తున్నారు. మరి కొందరు నెలకు రూ.9వేలు ఇస్తే.. నెల చివరి రోజున రూ.10వేలు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన పేదలు చేస్తున్న వ్యాపారంలో వచ్చే ఆదాయం సగం ఫైనాన్స్‌ వారికే చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు డబ్బు చెల్లించడంలో ఆలస్యమైనా, మళ్లీ వారి వద్ద అప్పు తీసుకోకపోయినా.. వడ్డీ వ్యాపారులు పలు విధాలుగా ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఇలా వడ్డీకి డబ్బులు ఇచ్చే సమయంలో ప్రామిసరీ నోట్లు, బ్యాంకు పాస్‌ బుక్కులు, లేదంటే ఏటీఎం కార్డులు ఇలా ఏదో ఒకటి విలువైన పత్రాల్ని జమానతుగా తీసుకుంటూ తదుపరి పేదలను ఇబ్బందులు పెడుతున్నారు.

అనుమతులపై అశ్రద్ధ..

ఎలాంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోంది. ప్రధానంగా ఫైనా న్స్‌, తాకట్టు వ్యాపారాలు చేయాలన్నా నిబంధనలు ప్రకారం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుం ది. ఇందుకు ప్రధానంగా రెవెన్యూ, రిజిస్ర్టేషన్‌, పోలీసు శాఖ ద్వారా లైసెన్సులు కలిగి ఉండాలి. లైసెన్స్‌లు పొం దిన వారు మాత్రమే నియమ నిబంధనలకు లోబడి వ్యాపారాలు కొనసాగించాలి. కానీ, జిల్లాలో చాలా మందికి లైసెన్సు లేమి లేవు. ఏళ్ల తరబడి వడ్డీ వ్యాపా రం చేస్తున్నా వారికి కూడా లైసెన్సులు లేవంటే వారి కున్న అశ్రద్ధకు అద్దం పడుతోంది. ఈ తరుణంలోనే జిల్లా పోలీసు శాఖ ఎట్టకేలకు దృష్టి సారించి దాడులు చేయడంతో వ్యాపారులు బెంబేలెత్తి పోయా రు. ఇదివరకు బాధితులెవరైనా అధిక వడ్డీలు తీసుకుంటున్నారని పోలీసులకు ఫిర్యాదు చే స్తే.. వడ్డీ వ్యాపారులకే పోలీసులు వత్తాసు పలికేవారనే అపవాదు ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు తీసుకుం టున్న చర్యల పట్ల ఒకింత హర్షం వ్యక్తమవుతోంది.

కొందరు ముందే సర్దుకున్నారు..?

వడ్డీ వ్యాపారం చేసే వారి ఇళ్లపై పోలీసులు ఆకస్మి కంగా దాడులు చేశారు. అయితే ఇందులో కొంత మంది ముందే సర్దుకొని జాగ్రత్త పడ్డట్లు ఆరోపణలు వస్తున్నా యి. పెద్ద మొత్తంలో దందా సాగించే వారిలో కొందరికి పోలీసులు వెసులుబాటు కల్పించారనే విమర్శలు వ స్తుండగా.. సదరు వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు చే యకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఏకకాలంలో ఎస్పీ ఆదేశాలతో దాడులు చేసిన పోలీసులు ఈ రకం గా వ్యవహరించడ ం ఏంటన్న గుసగుసలు తోటి వడ్డీ వ్యాపారుల నుంచే రావడం గమనార్హం. పక్కా సమాచా రంతో మిగిలిన వారి ఇళ్లపై సైతం దాడులు చేసి చర్య లు తీసుకోవాలనే డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమవుతోంది.

12 బృందాలుగా ఏర్పడి దాడులు..

ఎస్పీ కిరణ్‌ ఖరే ఆదేశాలతో బుధవారం రాత్రి పోలీ సులు 12 బృందాలుగా ఏర్పడి ఆకస్మిక దాడులు చేశారు. భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు సంపత్‌ రావు, రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి, కాటా రం, మహదేవపూర్‌ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఈ దాడుల్లో వడ్డీ వ్యాపారుల నుంచి 193 ప్రామిసరీ నో ట్లు, 93 ఏటీఎం కార్డులు, 61 ఖాళీ చెక్కులు, 28 బ్యాం కు పాసు బుక్కులు, 109 బ్యాంకు చెక్కులు, 13 బాండ్‌ పేపర్లు, 11 పట్టా పాస్‌బుక్కులు, రూ.3,71,240 నగదు స్వాదీనం చేసుకున్నారు. మొత్తంగా 12 మందిపై కేసు లు నమోదు చే సినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దాడుల్లో సీఐలు నరేష్‌కుమార్‌, నాగార్జునరావు, రవీం దర్‌తో పాటు ఎస్సైలు పాల్గొన్నారు.

అధిక వడ్డీ వసూలు చేసే వారి వివరాలివ్వండి : కిరణ్‌ ఖరే, ఎస్పీ

బాధితులెవరైనా అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారుల వివరాలను సంబంధిత పోలీసుస్టేషన్‌లో తెలియజేయాలి. వారి వివరాలను గోప్యంగా ఉంచి తగిన న్యాయం చేస్తాం. అక్రమ వడ్డీ, ఫైనాన్స్‌ వ్యాపారాలు చేస్తున్న వారి చేతుల్లో చిక్కి చాలా మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అమాయక ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీ వ్యాపారం చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా అలాంటి వారిని నమ్మి అప్పుగా డబ్బులు తీసుకోవద్దు.

Updated Date - Apr 11 , 2024 | 11:29 PM