Share News

రికవరీ పేరిట ఓవరాక్షన్‌

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:06 PM

కుటుంబ అవసరా లకో, వ్యాపార వినియోగానికో అనేక మంది ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఒకేసారి మొత్తం నగ దు చెల్లించే స్థోమత లేక ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తుంటారు. వాహనం కొనే ముందు పోటీ పడి మరీ కస్టమర్ల వద్దకు ఆయా ఫైనాన్స్‌ కంపెనీల ప్రతినిధు లు వస్తుంటారు. తీయని మాటలు చెప్పి.. వాహనం చేతికిచ్చాక కిస్తీల విషయంలో చుక్కలు చూపిస్తారు.

రికవరీ పేరిట ఓవరాక్షన్‌

మితిమీరుతున్న ఫైనాన్స్‌ ఏజెంట్ల ఆగడాలు

నిబంధనలకు విరుద్ధంగా వాహనాల సీజ్‌

కంపెనీకి సంబంధం లేని వ్యక్తుల ప్రమేయం?

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 28: కుటుంబ అవసరా లకో, వ్యాపార వినియోగానికో అనేక మంది ద్విచక్ర వాహనాలతో పాటు ఇతర వాహనాలను కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ మంది పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు ఒకేసారి మొత్తం నగ దు చెల్లించే స్థోమత లేక ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తుంటారు. వాహనం కొనే ముందు పోటీ పడి మరీ కస్టమర్ల వద్దకు ఆయా ఫైనాన్స్‌ కంపెనీల ప్రతినిధు లు వస్తుంటారు. తీయని మాటలు చెప్పి.. వాహనం చేతికిచ్చాక కిస్తీల విషయంలో చుక్కలు చూపిస్తారు. అయితే ఎక్కువగా ఫైనాన్స్‌పై అవగాహన లేని వారే ఉండడంతో ఫైనాన్స్‌ కంపెనీల రికవరీ ఏజెంట్లు ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నారు. పరిస్థితులు బాగా లేక కిస్తీ ఆగిపోతే వినియోగదారులకు నరకం చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు లేదా అంతకు మించి కిస్తీలు పెండింగ్‌లో ఉంటే వాహనాలను సీజ్‌ చేస్తా రు. వాహనాన్ని సీజ్‌ చేసే ముందు తప్పకుండా నోటీ స్‌ ఇవ్వాలి. కానీ ఇవేమీ పాటించడంలేదు. మరోవైపు కంపెనీ ప్రతినిధులు కాకుండా సంబంధం లేని వ్యక్తు లు కూడా ఇందులో తలదూర్చుతున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా వాహనాలను సీజ్‌ చేస్తున్నారు.

అవగాహన లేని ఏజెంట్లు..

కొన్ని ఫైనాన్స్‌ కంపెనీలు ఎలాంటి అవగాహన లేని వ్యక్తులను ఏజెంట్లుగా చేర్చుకోవడం వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాహనాన్ని సీజ్‌ చేస్తే కంపెనీలు ప్రోత్సాహకంగా కొంత కమీషన్‌ ఇస్తా యి. అంతేగాకుండా ఈఎంఐల కలెక్షన్‌ను బట్టి ఇన్సెం టివ్‌లు ఇస్తుంటాయి. వీటి కోసం నిజాయితీగా పనిచే స్తే మంచిదే. కానీ ఇన్సెంటివ్‌లు, కమీషన్ల ఆశతో కొం దరు నిబంధనలను మరిచిపోతున్నారు. ఇంకొందరు ప్రత్యేకంగా ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని రివకరీ పనులు చేయిస్తున్నారు. మూడు కిస్తీలు దాట కముందే అత్యుత్సాహంతో నిబంధనలకు విరుద్ధంగా సీజింగ్‌కు పాల్పడుతున్నారు. జనగామ పట్టణానికి చెందిన ఓ యువకుడు ట్రావెల్స్‌ నడుపుతూ జీవనో పాధి పొందేందుకు రెండేళ్ల క్రితం ఫైనాన్స్‌లో కారు కొన్నాడు. కిస్తీలు సమయానికి కడుతూనే వస్తున్నా డు. ఆయన ఒక కిస్తీ బకాయి ఉండగా.. మరో కిస్తీ వచ్చి రెండు రోజులైంది. అదే సమయంలో ఆ యువకుడి తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోతే హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ వద్ద రికవరీ ఏజెంట్లు ఇద్దరు వచ్చి బండి పక్కకు ఆపేశారు. రెండు కిస్తీలు కట్టాల్సిందేనని, లేదంటే బండి తమకు అప్పగించాలని పట్టుబట్టారు. సీజింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి తమ ఐడీ కార్డులు చూపాలని సదరు కిస్తీదారుడు నిలదీయగా వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కంపెనీకి సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులతో వారు రికవరీ చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. జనగా మకు చెందిన మరో వ్యక్తి స్నేహితుడి కారు తీసుకుని కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌కు వెళ్లాడు. ఈ కారు ఫైనాన్స్‌కు సంబంధించిన రికవరీ ఏజెంట్లు అక్కడ ప్రత్యక్షమై కారును నిలిపివేసి నానా హంగా మా చేశారు. పెండింగ్‌లో ఉన్న రెండు కిస్తీలు కడితే నే కారు కదులుతుందని హెచ్చరించడంతో ఆ కారు ఓనరు ఫైనాన్స్‌ కంపెనీ ప్రతినిధికి ఫోన్‌ చేశారు. సదరు ప్రతినిధి రికవరీ ఏజెంట్లకు ఫోన్‌ చేసి రెండు కిస్తీలకు కారు ఆపాలని ఎవరు చెప్పారని ప్రశ్నించ డంతో వారు కారును వదిలేశారు. ఇలా నిబంధనలు తెలియకున్నా కొందరు కిందిస్థాయి ఏజెంట్లు అత్యుత్సాహం చూపిస్తున్నారు. జనగామకు చెందిన ఓ యువకుడు గతంలో మూడు కిస్తీలు పెండింగ్‌లో ఉండగా.. మరో కిస్తీ దాటొద్దని హెచ్చరించారరు. దీంతో ఆయన ఈఎంఐలు క్లియర్‌ చేశారు. కానీ ఇటీవల అదే వ్యక్తి రెండు ఈఎంఐలు పెండింగ్‌లో ఉండగా రికవరీ ఏజెంట్లు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీజ్‌ చేసేశారు.

మార్చిలో మరింత కఠినం..

మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుం డడంతో ఫైనాన్స్‌ ఏజెంట్లు మరింత రెచ్చిపో తుంటారు. ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు చేయాలనే ఉద్దేశ్యంతో నిబంధనలు పాతరేస్తారని పలువురు ఫైనాన్స్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగులే చెబుతున్నారు. ఒక్క నెల ఈఎంఐ పెండింగ్‌లో ఉన్నప్పటికీ వాహనాలను అన్యాయంగా సీజ్‌ చేస్తారని, రికవరీ ఏజెంట్ల పైఅధికారులు ఈ మేరకు ఒత్తిడి తీసుకొస్తారని తెలిసింది. ఏదిఏమైనా బతుకుదెరువు కోసం, కుటుంబ అవసరాల కోసం ఫైనాన్స్‌లో బండ్లు తీసుకున్నందుకు తాము రికవరీ ఏజెంట్లతో తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందని పలువురు బాధితులు వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలపై సదరు ఫైనాన్స్‌ కంపెనీలు చర్యలు తీసుకుని, నిబంధనలు పాటించేలా చూడాలని కోరుతున్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:06 PM