Share News

రాబడి రాక.. సాగు చేయలేక..

ABN , Publish Date - Apr 07 , 2024 | 12:20 AM

పసుపు పంట సాగుకు మానుకోట ప్రాంతానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ పసుపు రాబడుల్లో రెండో స్థానంలో ఉండే ది. ఒకప్పుడు జిల్లాలో వాణిజ్య పంటలైన వేరుశన గ, పసుపు దిగుబడుల్లో రికార్డులు సాధించాయి. అ లాంటిది ధరల పతనం, పొరుగు రాష్ట్రాల్లో అధికం గా సాగు, ఇతరాత్ర అంశాల ప్రభావంతో ఏడేళ్లుగా పసుపు, వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోం ది.

రాబడి రాక.. సాగు చేయలేక..

పసుపు, వేరుశనగ సాగుపై సన్నగిల్లిన ఆసక్తి

జిల్లాలో భారీగా తగ్గిన సాగు విస్తీర్ణం

20 పల్లిపప్పు, 6 పసుపు డోలా, 7 నూనె మిల్లులూ బంద్‌

అనుబంధ పరిశ్రమలు కూడా మూత

ఉపాధి కోల్పోతున్న కార్మికులు

ప్రత్యామ్నాయం చూపని ప్రభుత్వం

కేసముద్రం, ఏప్రిల్‌ 6 : పసుపు పంట సాగుకు మానుకోట ప్రాంతానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ పసుపు రాబడుల్లో రెండో స్థానంలో ఉండే ది. ఒకప్పుడు జిల్లాలో వాణిజ్య పంటలైన వేరుశన గ, పసుపు దిగుబడుల్లో రికార్డులు సాధించాయి. అ లాంటిది ధరల పతనం, పొరుగు రాష్ట్రాల్లో అధికం గా సాగు, ఇతరాత్ర అంశాల ప్రభావంతో ఏడేళ్లుగా పసుపు, వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోం ది. జిల్లాలో ప్రముఖంగా ఉన్న మహబూబాబాద్‌, కేసముద్రం మార్కెట్లలో వేరుశనగ, పసుపు పంటల రాబడులు ఏటా తగ్గుతూ వస్తుండటంతో రైతులు సాగుకు అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోం ది. ఫలితంగా ఆయా మార్కెట్ల పరిధిలో వేరుశనగ, పసుపు పంట ఉత్పత్తులకు అనుగుణంగా నెలకొల్పి న పరిశ్రమలు ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని మూసివేసే దశలో ఉండడం ఆందోళన కలిగించే వి షయం. పరిశ్రమలు మూతపడడం వల్ల వాటిపై ప్రత్యక్షం గా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వందలాది కార్మికు లు ఉపాధి కోల్పోతున్నారు. పంట ఉనికి కోల్పేయే పరిస్థి తులు ఉండడంతో రైతుల నుంచి పరిశ్రమలు నెల కొల్పిన వ్యాపారులు, వాటిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల వరకు గొలుసుకట్టులో ఉన్న వారంతా నష్టపోనున్నారు.

ఒకప్పుడు వెలుగులు..

మహబూబాబాద్‌ జిల్లా పేరు చెప్పగానే వాణిజ్య పంట ఉత్పత్తుల్లో పసుపు గుర్తొస్తుంది. ఇక్కడి పసుపు సాగును ప్రత్యేకంగా మాజీ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రస్తావించడం గమనార్హం. దశాబ్దాల క్రితం కేసముద్రం మార్కెట్‌లో పసుపు, వేరుశనగ పంట ఉత్పత్తులు యార్డు స్థలం సరిపోక రోడ్ల వెంట రాశులుగా పోసి రోజుల తర బడి పడిగాపులు పడుతూ విక్రయించారు. జిల్లాలోని పసుపును, పసుపు డోలా మిల్లుల్లో ఉత్పత్తి అయిన పొడిని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక నూనె మిల్లుల్లో నూనెను హోల్‌సేల్‌గా కంటే రిటైల్‌గా మిల్లులు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలే కాకుండా దూరప్రాం తాల నుంచి వచ్చిన వారు సైతం ఖరీదు చేసుకొని క్యాన్లలో తీసుకువెళ్లేవారు. ఆయా మిల్లుల్లో ఉత్పత్తి అయి న పల్లిపప్పును గ్రేడింగ్‌ చేసి దేశ విదేశాలకు ఎగుమతి చేసే వారు. పసుపు, పల్లి మిల్లుల్లో 400మందికి పైగా కా ర్మికులు, హమాలీలు పనిచేస్తుండగా, మరో 500మంది వ రకు పరోక్షంగా ఈమిల్లులపై ఆధారపడిన వారు ఉన్నారు.

మూసివేత దిశలో పరిశ్రమలు

జిల్లాలో ప్రధానంగా కేసముద్రం మార్కెట్‌ పరిధిలో 11 పుసుపు డోలా మిల్లులు ఉన్నాయి. ఇందులో 9మూతపడగా, రెండు మిల్లులు అం తంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. మా ర్కెట్‌లో పసుపు అందుబాటులో లేకపోవడం తో పాలిషింగ్‌ యూనిట్లు, పౌడర్‌ మిల్లులు బంద్‌ అవుతూ వస్తున్నాయి. దీంతో ఏళ్ల తరబడి పసుపు డోలాల్లో, ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు వీధిన పడ్డారు. వారం తా ఇతర కూలీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే రీతిలో నూనె మిల్లులు 8 ఉండగా వీటిలో 7 మిల్లులు బంద్‌ అయ్యాయి. వేరుశనగకాయల నుంచి గింజలను వేరు చేసి పల్లిపప్పును ఎగుమతి చేసే మిల్లులు 20 ఉం డగా అన్ని బంద్‌ కావడం గమనార్హం. ఆయా మిల్లులకు అనుబంధంగా ఉన్న మార్కెట్లకు వేరుశనగకాయ విక్రయానికి రాక పోవడంతో నూనె మిల్లులకు ప్ర ధాన ముడిసరుకు అందుబాటు లో లేక బంద్‌ చేసుకున్నారు. జి ల్లాలో అరకొర వేరుశనగ రాబ డులతో ఒకటి, రెండు మిల్లులు మిగిలి ఉన్నాయి. మూతపడిన నూనెల మిల్లులపై ఆధారపడి జీ విస్తున్న మిల్లు డ్రైవర్లు, కార్మి కులు ఉపాధి కోల్పోయారు.

తగ్గిన సాగు విస్తీర్ణం?

జిల్లాలో పసుపు, వేరుశనగకాయ సాగు విస్తీర్ణం తగ్గడానికి అధిక పెట్టుబడులు, తక్కువ ధరలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఆయా పంటలకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతుకు నష్టాలు మి గులుతున్నాయి. దశాబ్ధంన్నర క్రితం క్వింటాకు రూ.16వేల ధర నమోదైన పసుపు మళ్లీ అదే రీతిలో అమాంతం పెరగక పోతుందా.. అనే ఆశతో ఏటా రైతులు సాగు చేస్తూనే ఉన్నారు. అధిక పెట్టుబడితో పండిం చే పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పసుపు రైతులు పదేళ్లుగా తీవ్రం గా నష్టపోతున్నారు. ఈ క్రమం లో చాలా మంది రైతులు ఏటా పసుపు సాగును తగ్గిస్తూ వస్తు న్నారు. ఈ ఏడాది పసుపు ధర భిన్నంగా ఉంది. సీజన్‌ ఆరంభంలోనే క్వింటాకు రూ.12వేల నుంచి రూ.14వేల వరకు ధర నమోదవుతోంది. అయితే రైతుల వద్ద పసుపు లేకుండా పోయింది. ఇతర రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు నాణ్యమైన పసుపు లభిస్తోంది. ఇక వేరుశనగ పంట సరిగ్గా ఇదే తరహాలో ధరలు లేకపోవడం, పెట్టుబడులు ఎక్కువ కావడం, కోతుల బెడద కారణంగా రైతులు క్రమంగా ఈ పంట సాగుకు దూరమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈసారి పసుపు ధర అత్యధికంగా ఉండడంతో విత్తనం పసుపుకు డిమాండ్‌ పెరిగింది. గ్రామాల్లో కొంతమంది రైతులు పసుపును విత్తనంగా క్వింటాకు రూ.5వేల చొప్పున నేరుగా ఇతర రైతులకు అమ్ముతున్నారు.

ధరలపై పొరుగు రాష్ట్రాల ప్రభావం

పసుపు, వేరుశనగ పంటల ధరలపై పొరుగు రాష్ట్రాల దిగుబడులు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. మహా రాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో పసుపు, వేరుశనగ పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పైగా అక్కడి నేలలు పసుపు, వేరుశనగలో నాణ్యమైన రకం పండించేందుకు అనుకూలంగా ఉంటూ రెట్టింపు దిగుబడి వస్తోందని తెలుస్తోంది. నాణ్యత విషయంలో ఈ ప్రాంతం లోని పసుపు, వేరుశనగ పంటలు పొరుగు రాష్ట్రాల కంటే తక్కువగా ఉండడంతో ధరలు ఉండడం లేదని తెలుస్తోంది. దేశీయ మార్కెట్లోకి వేలాది క్వింటాళ్లు ఇతర రాష్ట్రాల మార్కెట్ల నుంచే విక్రయానికి వస్తుండడంతో ఇక్కడి మార్కెట్లలో ధరలు ఉండడం లేదని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా సేలం వెరైటీ పసుపు సాగు చేస్తే ఇక్కడి రైతులకు లాభసాటిగా ఉంటుందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.

పట్టించుకోని గత ప్రభుత్వం

పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోయినా గత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు, కార్మికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పసుపు, వేరుశనగ పంటలు జిల్లాలో ఉనికి కోల్పోయే దశలో ఉండడంతో వాటి అనుబంధ రంగాలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలు వేలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఒకప్పుడు రికార్డులు నెలకొల్పిన ఉత్పత్తులు, ధరలు ఇప్పుడెందుకు రావడం లేదనే పరిస్థితులను ప్రభుత్వం అధ్యయనం చేసి వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్లకు వస్తున్న పంట ఉత్పత్తులకు అనుగుణంగా వాటికి సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేసే ప్రణాళికలు రూపొందించాలని కార్మికులు కోరుతున్నారు. ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించి వాటి అనుబంధ పరిశ్రమలను నెలకొల్పి కార్మికులకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Updated Date - Apr 07 , 2024 | 12:20 AM