Share News

పది జోన్లుగా మేడారం

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:03 PM

ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుం చి నాలుగు రోజులపాటు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను విజయవంతంగా జరిపించాలని, మొత్తం పది జోన్లుగా పనులను విభజించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు.

పది జోన్లుగా మేడారం
మేడారం సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

పని విభజన చేసి సౌకర్యాలు కల్పించాలి

31లోగా మహాజాతర ఏర్పాట్లు పూర్తికావాలి

రూ.30 కోట్ల విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌

భక్తుల కోసం 6 వేల ఆర్టీసీ బస్సులు

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రుల సమీక్ష

పాల్గొన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లా కలెక్టర్లు, పోలీసు, ఇతర శాఖల అధికారులు

ములుగు, జనవరి 9: ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుం చి నాలుగు రోజులపాటు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను విజయవంతంగా జరిపించాలని, మొత్తం పది జోన్లుగా పనులను విభజించి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. రూ.75 కోట్ల నిధులతో మొదలుపెట్టిన పనులను ఈనెల 31లోగా పూర్తి చేయాలని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగ కుండా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఆధ్వర్యంలో రాష్ట్ర ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. పోలీసు, రెవె న్యూ, అటవి, రోడ్డు భవనాలు, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులతోపాటు ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్‌ కలెక్టర్లు ఇలా త్రిపాఠి, భవేష్‌ మిశ్రా, సిక్తాపట్నాయక్‌, ప్రావీణ్య , ఎస్పీలు, ఆయా శాఖల అధికా రులు పాల్గొన్నారు. రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడతూ జాత రకు వచ్చే భక్తులు ప్రశాంతంగా వనదేవతలను దర్శించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఆదివాసీ సంస్కృ తీ సంప్రదాయాలు ప్రతిబింభిం చేలా కళాకారులతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. స్నానఘట్టాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. జంపన్న వాగులోని నీరు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలన్నారు. తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చాలని, క్యూలైన్లలో భక్తులకు ఇబ్బంది జరగకుండా చూడాలని అన్నారు. రూ.75 కోట్లకు అదనంగా మరో రూ.30 కోట్ల కోసం అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను ఆమోదించి వెంటనే నిధులను విడుదల చేస్తామని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే జాతర సక్సెస్‌ అవుతుందని అన్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళా భక్తుల రద్దీ పెరిగే అవకాశ ముందని, అందుకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగు పర్చాలని అన్నారు. ఈసారి 6 వేల బస్సులను నడిపించడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. జాతర నిర్వహణపై అనుభవం ఉన్న అధికారులను గుర్తించా లని, వారు రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉన్నా ప్రత్యేకంగా కేటాయిస్తామని తెలిపారు. గత జాతరలలో పనిచేసిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. పంచాయతీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ జాత రను ప్లాస్టిక్‌ రహితంగా జరిపించాలన్నారు. రోడ్ల మరమ్మతులను సత్వరమే పూర్తిచేయాలని, ఇరు వైపులా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. జాతరలో తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేలా కాల్‌సెంటర్లను ఏర్పాటు చేయాలన్నా రు. దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆదివాసీ సంప్రదాయాలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ జాతర జరిపించాలన్నారు. దొంగత నాలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. మహాజాతర విశిష్టతపై డాక్యుమెంటరీని రూపొందిం చాలని అధికారులకు సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు అవగాహన కల్పిస్తూ సామాజిక మాధ్య మాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. 400 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తామని డీజీపీ తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు. ఈ సమీక్షలో ములుగు ఎస్పీ శబరీశ్‌, ఇటీవల ఆదిలాబాద్‌కు బదిలీపై వెళ్లిన ఎస్పీ గాష్‌ఆలం, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో అంకిత్‌, ములుగు డీఎస్పీ రవీందర్‌, ఇరిగేషన్‌ సీఈ విజయభాస్కర్‌, ఐటీడీఏ ఈఈ హేమలత, డీపీవో వెంకయ్య, డీపీఆర్‌వో రఫీఖ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:03 PM