Share News

కడుపు నింపిన కళను బతికిస్తూ..

ABN , Publish Date - Jan 26 , 2024 | 01:06 AM

వారసత్వంగా వచ్చిన కళనే ఆయన నమ్ముకున్నారు. చిన్న తనంలో తండ్రి వెంట నడిచి కడుపు నింపే చిందు యక్షగాన కళామ తల్లి ఒడిలో ఆయన ఒదిగిపోయారు. 16 ఏళ్ల ప్రాయంలోనే వేదికలు ఎక్కి రామాయణ, మహాభా రత, భాగవతం, జాంబవ పురాణ కథలను అవలీలగా ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. కులవృత్తిగా భావించో, కడుపు నింపుకోవ డం కోసమో కాకుండా అంత రించిపోతున్న కళను కాపాడాల నే సంకల్పాన్ని ఆయన తన 16 ఏటనే తీసుకున్నారు.

కడుపు నింపిన కళను బతికిస్తూ..
భీముడి వేషధారణలో గడ్డం సమ్మయ్య

50 ఏళ్లుగా చిందు యక్షగాన ప్రదర్శనల్లో మేటిగా గడ్డం సమ్మయ్య

ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపిక

వెక్కిరింపులను దిగమింగుకుంటూ కళామతల్లి సేవలో తరింపు

జనగామ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : వారసత్వంగా వచ్చిన కళనే ఆయన నమ్ముకున్నారు. చిన్న తనంలో తండ్రి వెంట నడిచి కడుపు నింపే చిందు యక్షగాన కళామ తల్లి ఒడిలో ఆయన ఒదిగిపోయారు. 16 ఏళ్ల ప్రాయంలోనే వేదికలు ఎక్కి రామాయణ, మహాభా రత, భాగవతం, జాంబవ పురాణ కథలను అవలీలగా ప్రదర్శన ఇవ్వడం ప్రారంభించారు. కులవృత్తిగా భావించో, కడుపు నింపుకోవ డం కోసమో కాకుండా అంత రించిపోతున్న కళను కాపాడాల నే సంకల్పాన్ని ఆయన తన 16 ఏటనే తీసుకున్నారు. 50 ఏళ్లుగా చిందు యక్షగాన కళన బతికిస్తూ భావితరాలకు అందిస్తున్న జన గామ జిల్లా దేవరుప్పుల మం డలం అప్పిరెడ్డిపల్లి చెందిన గడ్డం సమ్మయ్యను ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకొని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పద్మశ్రీ పురస్కా రాల జాబితాలో సమ్మయ్యకు చోటు దక్కింది.

ఐదు దశాబ్ధాలుగా చిందు యక్షగాన కళను బతికిస్తు న్న జనగామ జిల్లాకు చెందిన గడ్డం సమ్మయ్యను ‘పద్మశ్రీ’ పురస్కారం వరించింది. కళల విభాగంలో ఆయన అందించిన సేవలకు గాను 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన ను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన గడ్డయ్య సమ్మయ్య పేద కుటుంబంలో జన్మించారు. అంతరించిపోతున్న చిందు యక్షగాన కళను బతికిస్తూ జాతీయ స్థాయిలో పుట్టిన గడ్డకు గడ్డం సమ్మయ్య పేరు తెచ్చారు. పాలకుర్తి మండలం వల్మిడిలో గడ్డం(చిందుల) రామ స్వామి, చండిగాంబ దంపతులకు సమ్మ య్య 1958లో జన్మించారు. ఆ తర్వాత రామస్వామి దేవరుప్పుల మండ లం అప్పిరెడ్డిపల్లిలో స్థిరపడ్డారు. ఆరో తరగతి వరకు చదువుకు న్న సమ్మయ్య తల్లిదండ్రులతో పాటు తమ కులవృత్తి అయిన చిందు యక్షగాన ప్రదర్శనల్లో పాల్గొనేవారు. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా తండ్రితో కలిసి చిన్ని కృష్ణుడి వేషధారణలో కళారంగ ప్రవే శం చేశారు. జాంబవ పురాణం, భాగవతం, రామాయణం వంటి కథలను ప్రదర్శనల రూపంలో చెప్ప డమే చిందు యక్షగానం. చిన్ననాటి నుంచి ఈ కళపై మక్కువతో 5 దశా బ్ధాలుగా దాదాపుగా 19 వేల ప్రదర్శన లు ఇస్తూ వస్తున్నారు. సమ్మయ్య లోహి తాంకుడు, ప్రహ్లాదుడు, సిరియాలుడు, బాలవద్దిరాజు పాత్రల్లో ఎ క్కువగా ప్ర దర్శనలు ఇచ్చేవారు. అంతేకాకుం డా సత్య హరిశ్చంద్ర, కీచక, కంసుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, రావణబ్రహ్మ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోతారు. గడ్డం సమ్మయ్యకు వరంగల్‌ జిల్లా పర్వతగిరికి చెందిన ముత్తిలింగం కుమార్తె శ్రీరంజినితో 1983లో వివాహం జరిగింది. సమ్మయ్యకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడు సోమరాజు చిందు కళలోనే ఉన్నారు.

వెక్కిరింపులనే మెట్లుగా చేసుకొని..

చిందు యక్షగాన కళా విభాగంలో పద్మశ్రీ పురస్కా రం పొందిన సమ్మయ్య ముందు నుంచీ అనేక అవ మానాలు, వెక్కిరింపులను ఎదుర్కొన్నారు. చిన్న వయ స్సులో వేదికలు ఎక్కి ప్రదర్శనలు ఇవ్వడం, స్త్రీ పాత్రల్లో నటించడం కారణంగా ఒత్తుగా జుట్టు పెంచుకోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో పలు చోట్లకు వెళ్లినప్పుడు అవ మానాలు ఎదురైన సంఘటనలు ఉన్నాయి. అయినప్ప టికీ నమ్ముకున్న కళను బతికిస్తూ ఆసక్తి ఉన్న యువకు లకు శిక్షణ ఇస్తూ ఆయన జాతీయస్థాయిలో ఎదిగారు.

2017లోనే ‘పద్మశ్రీ‘ ప్రతిపాదిత జాబితాలో చోటు

జనగామ జిల్లాకు చెందిన గడ్డం సమ్మయ్యకు 2017 లోనే పద్మశ్రీ పురస్కారం చేజారింది. అప్పట్లో రాష్ట్రం నుంచి పద్మశ్రీ పురస్కారాలకు తెలంగాణ నుంచి 47 మంది పేర్లను కేంద్రానికి పంపగా అందులో సమ్మయ్య పేరు ఉంది. కానీ.. అప్పట్లో చేజారిన పురస్కారం ఇప్పు డు వరించింది.

ప్రదర్శనలు, సన్మానాలు, పురస్కారాలు

1985లో జనగామ మునిసిపల్‌ కార్యాలయంలో తెలుగు విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఒగ్గుకథా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహాభారతంలోని ‘కీచక వధ’ అనే పౌరాణిక ఘట్టాన్ని అద్భుతంగా ప్రదర్శించగా అప్పటి మంత్రుల చేతుల మీదుగా సన్మానం అందుకున్నారు.

ఠ 1998లో నెహ్రూ యువకేంద్రం ద్వారా కళా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం లభించింది. ఠ 9 మంది బృందంతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శనలు ఇచ్చా రు. 1991లో ఆలిండియా రేడియాలో 80 ప్రదర్శనలు, దూరదర్శన్‌లో 90 ప్రదర్శనలిచ్చారు. ఠ సాంస్కృతిక, పర్యాటక శాఖలో సుమారు 4000 ప్రదర్శనలు ఇవ్వడ మే కాకుండా ఢిల్లీ, ఒడిషా, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. కాగా.. సమ్మయ్య సేవలకు గాను 2009లో ఆయన ‘కళారత్న’ బిరుదును అందుకున్నారు.

Updated Date - Jan 26 , 2024 | 01:06 AM