Share News

జోరుగా పీడీఎస్‌ బియ్యం దందా

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:23 AM

జిల్లాలో రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. లబ్ధిదా రుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, సిం డికేట్‌గా ఏర్పడి కొందరు వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కాకినాడ ఫోర్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి.

జోరుగా పీడీఎస్‌ బియ్యం దందా
నర్సింహులపేటలో అక్రమంగా డంప్‌ చేసిన రేషన్‌ బియ్యాన్ని చూపుతున్న అప్పటి తొర్రూరు డీఎస్పీ రాజరత్నం (పైల్‌)

గ్రామాల్లో కిలో రూ.8 కొనుగోలు చేసి, అధిక ధరకు అమ్ముతున్న వ్యాపారులు

రైస్‌ను మానుకోట టు కాకినాడ ఫోర్టుకు తరలింపు.. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు..

చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు

జిల్లా వ్యాప్తంగా 557 రేషన్‌ దుకాణాలు

నర్సింహులపేట, జనవరి 11 : జిల్లాలో రేషన్‌ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. లబ్ధిదా రుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, సిం డికేట్‌గా ఏర్పడి కొందరు వ్యాపారులు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వాటిని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కాకినాడ ఫోర్టుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయి.

కొందరు వ్యాపారులు ఎఫ్‌ఎ్‌ససీ కార్డుదారుల నుం చి, రేషన్‌ డీలర్ల నుంచి తక్కువ ధరలకు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. పీడీఎస్‌ అధికధరకు ఇతర రాష్టాలకు అక్రమంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో 18 మండలాల లో 557 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. 2,24,818 తెల్ల రేషన్‌ కార్డులు, 15,553 అంత్యోదయ కార్డులు, 2 అన్నపూర్ణ కార్డులకుగాను నెలనెలా 7,059 టన్నుల బియ్యం సరఫరా అవుతోంది.కార్డు లబ్ధిదారులకు ఈ బియ్యాన్ని రూపాయకే ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కాగా, తొర్రూరుసబ్‌డివిజన్‌లోని సీరోలు, మరిపెడ, తొర్రూరు, ఉమ్మడి నర్సింహులపేట మండలాలతో పాటు పెద్దగూడూరు, కొత్తగూడ, కేసముద్రం, గార్ల, కురవి, నెల్లికుదురు మండలాల్లో ఈరేషన్‌ బియ్యం దందా అధికంగా కొనసాగుతోంది.

ఊరి చివర ఉన్న ఇళ్లే అడ్డాలు..

జిల్లాలో పీడీఎస్‌ బియ్యం దందా కొనసాగుతోంది. అక్రమ రవాణాదారులు సిండికేటుగా ఏర్పడి, రేషన్‌ బియ్యాన్ని ద్విచక్రవాహనాలు, ఆటోలు, టాటాఏసీ వాహనాలల్లో బియ్యం బస్తాలను తీసుకువచ్చి.. పాత రైస్‌మిల్లులు, రోడ్డు సౌకర్యం ఉండి ఊరు చివరన ఉన్న ఇళ్లలో అడ్డాలుగా ఏర్పాటు చేసుకుని, డంప్‌ చేస్తారు. భారీ మొత్తంలో జమచేసిన తర్వాత రాత్రి సమయాలల్లో టర్బో లారీల్లో కాకినాడ ఫోర్టుకు అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడి నుం చి ఇతర రాష్ట్రాలకు తరలుతున్నాయి.

కిలో రూ.8 కొనుగోలు చేసి..

జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాలల్లో కొందరు సిండికేటుగా ఏర్పడి రేషన్‌ బియ్యాన్ని రూ.5 నుంచి రూ. 8కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు కాకినాడ ఫోర్టుకు రూ.15 నుంచి రూ. 18లకు అధిక ధరలకు అక్రమంగా తరలిస్తున్నారు. బ్లాక్‌ మార్కెట్‌ వ్యాపారులకు కొందరు రేషన్‌ డీలర్ల మద్దతు ఉండడం వల్లనే భారీ స్థాయిలో పీడీఎస్‌ బియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అధికారులకు సవాల్‌గా..

పీడీఎస్‌ అక్రమ దందా సంబంధిత అధికారులకు సవాల్‌గా మారుతోంది. నిలువరించేందుకు అధికారులు నిఘా ఏర్పాటు చేస్తున్నప్పటికీ వారి కంట్లో పడకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు స్రమాచారం. ఇటీవల నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచలో ఓ వ్యాపారి పాత ఇంటిలో 15 క్వింటాల రేషన్‌ బియ్యాన్ని నిల్వ చేశారనే సమాచారంతో ఆ ఇంటిపై స్థానిక ఎస్సై సతీష్‌ దాడి చేసి, బియ్యాన్ని సీజ్‌ చేశారు. గత నవంబరు మాసంలో మరిపెడ మండలంలోని పురుషోత్తాయగూడెంలో పోలీసులు 25 క్వింటాల బియ్యాన్ని సీజ్‌ చేశారు. పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ అక్రమ బియ్యం దందా మాత్రం ఆగడం లేదని పలువురు తెలుపుతున్నారు.

ఏటా రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వ్యాపారం

రేషన్‌ బియ్యం దందాల్లో రూ.లక్షల్లో చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏడువందల పైచిలుకు టన్నుల పీడీఎస్‌ బియ్యం కిలో రూపాయి చొప్పున ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీనిని ఆసరా చేసుకున్న కొందరు కొనుగోలు చేసి, రూ. 5నుంచి రూ.8 కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిండికేట్‌ వ్యాపారులు ఇరత రాష్ట్ర్టాలకు బియ్యం రూ.18 కేజీ చొప్పున బియ్యం అక్రమంగా తరలిస్తూ.. ఏటా రూ. 6.కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు లావాదేవీలు జరుతుతున్నట్లు సమాచారం.

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం : జి.నర్సింహా, ఆర్డీవో తొర్రూరు

డీలర్లు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసినా, విక్రయించినా సహించేది లేదు. ఫిర్యాదు చేస్తే 6ఏ కేసు నమోదు చేసి, పీడీ యాక్టు కేసు నమోదు చేస్తాం. ప్రభుత్వం నెలనెలా సరఫరా చేస్తు న్న పీడీఎస్‌ బియ్యం ప్రజలకే అం దేలా చర్యలు తీసుకుంటాం..

Updated Date - Jan 12 , 2024 | 12:23 AM