Share News

కొనుగోలు కేంద్రాల్లో ఐరిస్‌ విధానం

ABN , Publish Date - Apr 10 , 2024 | 12:05 AM

దళారీ వ్యవస్థను నిర్మూలించి, ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్న లక్ష్యం తో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు క్రేందాలను ఏర్పాటు చేస్తోంది. ఈ బాధ్యతలను స్వ యం సహాయక మహిళా సంఘాలు, సహకార సంఘాలకు అప్పగిస్తోంది. అయితే ఈ కొనుగోళ్ల ప్రక్రి యలో సాంకేతిక ఇబ్బందులతో పాటు దళారుల బెడద నెలకొంటోంది. రైతులకు ఓటీపీ నంబర్ల సమస్యలు, కొన్ని చోట్ల మిల్లర్లు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతుల పేరిట కేంద్రాల్లో విక్రయాలు జరపడం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

కొనుగోలు కేంద్రాల్లో ఐరిస్‌ విధానం
జఫర్‌గడ్‌ మండలం తమ్మడపల్లి(జి)లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఆర్‌డీవో వెంకన్న (ఫైల్‌)

అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు సర్కారు చర్యలు

వారం రోజుల్లో కేంద్రాలకు ఐరిస్‌ పరికరాలు

జిల్లాలో మొత్తం 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

సౌకర్యాలు కల్పించాలంటున్న రైతులు

జఫర్‌గడ్‌, ఏప్రిల్‌ 9: దళారీ వ్యవస్థను నిర్మూలించి, ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్న లక్ష్యం తో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు క్రేందాలను ఏర్పాటు చేస్తోంది. ఈ బాధ్యతలను స్వ యం సహాయక మహిళా సంఘాలు, సహకార సంఘాలకు అప్పగిస్తోంది. అయితే ఈ కొనుగోళ్ల ప్రక్రి యలో సాంకేతిక ఇబ్బందులతో పాటు దళారుల బెడద నెలకొంటోంది. రైతులకు ఓటీపీ నంబర్ల సమస్యలు, కొన్ని చోట్ల మిల్లర్లు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై రైతుల పేరిట కేంద్రాల్లో విక్రయాలు జరపడం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు గాను ఈ యాసంగి ధా న్యం కొనుగోళ్లలో ఐరిస్‌ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఐరిస్‌ (కంటిపాప) అమలు కోసం స్వయం సహాయక సంఘాల ప్రతిని ధులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. వారం రోజుల్లో జిల్లా లోని ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఐరిస్‌ యంత్రాలు అందనున్నాయి. జిల్లాలో మొత్తం 190 ధా న్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణ యించారు. తాజా విధానంలో ఓటీపీతో పాటు ఐరిస్‌ సాయాన్ని వినియోగించడంతో కొనుగోళ్లలో అక్రమా లకు ఆస్కారం ఉండదని భావిస్తున్నారు.

గతంలో ఓటీపీ విధానం...

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో గతం లో ఓటీపీ విధానం అమలులో ఉండేది. రైతుబంధు పాస్‌ పుస్తకం నంబరుతో ఆధార్‌, మొబైల్‌ నంబరు అనుసంధానించారు. పంట విక్రయించిన రైతు ఆధార్‌, బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబరును ట్యాబ్‌లో నమోదు చేస్తే వచ్చిన ఓటీపీతో ధాన్యం కొనుగోలు చేసేవారు. సంబంఽధిత రైతులు కేంద్రంలో లేకుండా వేరే చోట ఉన్నా.. అతడి మొబైల్‌ నంబరుకు వచ్చిన ఓటీపీ నం బరు చెబితే చాలు నమోదు చేసుకునేవారు. ఈ పాత విధానం వల్ల కొందరు వ్యాపారులు, దళారులు.. నిర్వా హకులతో కుమ్మకై.. రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యా న్ని కొనుగోలు చేసి.. ఆఽ ధాన్యాన్ని రైతుల పేరుతో కొనుగోలు కేంద్రాల్లో మద్థతు ధరకు విక్రయించి సొ మ్ము చేసుకుంటున్నారు. అంతేకాకండా మొబైల్‌, ఆధా ర్‌ అనుసంఽధానంలో, ఓటీపీ నంబరు రావడంలో, బ్యాం కులో రైతుల ఖాతాలో ధాన్యం డబ్బు జమ కావడంలో పలు సాంకేతిక సమస్యలు ఎదుర య్యేవి. ఈ ఇబ్బందు లను తొలగిం చేందుకు ఐరిస్‌ విధానం దోహ దపడు తుందని సర్కార్‌ నిర్ణయించింది.

రైతులు కేంద్రాలకు రావాల్సిందే

ఐరిస్‌ విధానం అమలుతో ధాన్యాన్ని విక్రయించే రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి రావాల్సిందే. ధాన్యం తూకం వేసిన తరువాత కేంద్రం నిర్వాహకులు సంబంధిత రైతుల ఐరిస్‌ (కంటిపాప) తీసుకుంటారు. తద్వారా పాసుపుస్తకం నంబరు, ఆధార్‌ నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. దీంతో ఎలాంటి సాంకేతిక సమస్యలకు ఆస్కారం ఉండదు. అక్రమాలకు సైతం అడ్డు కట్ట పడనుంది. సంబంఽఽఽధిత రైతు ఖాతాల్లో నేరుగా ధాన్యం డబ్బులు జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు.

సౌకర్యాలు కల్పించి, ఇబ్బందులను తొలగించాలి : రైతులు

కొనుగోలు కేంద్రాల వద్ద తగు సౌకర్యాలను కల్పిం చాలని రైతులు కోరుతున్నారు. వేసవిలో మండుతున్న ఎండల దృష్ట్యా కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించేందుకు వచ్చిన రైతులకు నీడ వసతితో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందించాలి. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని క్రమబద్ధంగా తూకం వేసి ఎప్పటికపుడు లారీల ద్వారా సంబంధిత మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. గతంలో గన్నీ బ్యాగులు, లారీల కొరతతో రోజుల తరబడి కేంద్రాల్లో నిరీక్షించాల్సి రావడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నామని రైతులు చెబుతున్నారు. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంధీగా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు.

పారదర్శకతకు అవకాశం: రాజేంద్రప్రసాద్‌, డీఆర్‌డీఏ డీపీఎం (మార్కెటింగ్‌), జనగామ

ఐరిస్‌ విధానం ఆమలైతే ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతకు అవకాశం ఉంటుంది. పొరపాట్లు, సాంకేతిక ఇబ్బందులు తొలగడంతో పాటు రైతులకు మేలు జరుగుతుంది. రైతుల పూర్తి వివరాలు నమోదవుతాయి. తద్వారా ధాన్యం డబ్బులు సదరు రైతు ఖాతాలో నేరుగా జమ అవుతాయి. గతంలో ఓటీపీ విధానం వల్ల పలు ఇబ్బందులు ఎదురయ్యేవి. జిల్లాలో ఐకేపీ, సొసైటీ పరిధిలో మొత్తం 190 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో 106 ఐకేపీ నేతృత్వంలో, మిగతావి సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం. ఐరిస్‌ నిర్వహణకు సంబంధించి నిర్వాహకులకు శిక్షణ ఇచ్చాం. వారం రోజుల్లో జిల్లాకు ఐరిస్‌ పరికరాలు రానున్నాయి. అంతవరకు ఓటీపీ పద్ధతిలో కొనుగోళ్లను జరుపుతున్నాం. నూతన విధానం అమలుతో రైతులు తప్పనిసరిగా కేంద్రానికి రావాల్సి ఉంటుంది.

Updated Date - Apr 10 , 2024 | 12:05 AM