Share News

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:42 PM

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కాను న్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశా రు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గత సంవత్సరం కంటే కాస్త ముందుగానే టైంటేబుల్‌ సిద్ధమైంది.

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
దేవరుప్పుల పరీక్షా కేంద్రంలో ప్రీ ఎగ్జామినేషన్‌ వర్క్‌ చేస్తున్న సిబ్బంది

ఏర్పాట్లు పూర్తి

జిల్లాలో 9,139 మంది విద్యార్థులు

18 పరీక్ష కేంద్రాలు

నిమిషం నిబంధన అమలు

జనగామ కల్చరల్‌, ఫిబ్రవరి 26: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కాను న్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశా రు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో గత సంవత్సరం కంటే కాస్త ముందుగానే టైంటేబుల్‌ సిద్ధమైంది. ప్రాక్టి కల్‌ పరీక్షలతో పాటు, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం వి ద్యార్థులకు ఇంగ్లీషు ప్రాక్టికల్‌ పరీక్ష, పర్యావరణ విద్య పరీక్షలు ముగిశాయి. థియరీ పరీక్షలపై ఇప్పటికే కలెక్ట ర్‌ సమీక్ష నిర్వహించగా, జిల్లా ఇంటర్‌ విద్యాధికారి సైతం నిర్వాహకులకు అవగాహన కల్పించారు.

టైం టేబుల్‌ ఇలా...

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు గాను టైంటేబుల్‌ ఈ విధంగా ఉంది. ఫిబ్రవరి 28న లాంగ్వేజ్‌ పేపర్‌ -1, 29న లాంగ్వేజ్‌ పేపర్‌-2, మార్చి 1న ఇంగ్లీషు - 1, 2న ఇంగ్లీషు - 2, 4న మ్యాథమెటిక్స్‌-ఏ, బాటనీ, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ - 1, 5న మ్యాథమెటిక్స్‌-ఏ, జువాలజీ, పొలిటికల్‌ సైన్స్‌ పేప ర్‌ - 2, 6న మ్యాథమెటిక్స్‌-బి, బాటనీ, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1, 7న మ్యాథమెటి క్స్‌-బి, జువాలజీ, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌ - 2, 11న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పేపర్‌-1, 12న ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పేపర్‌ - 2, 13న కెమిస్ట్రీ, కామర్స్‌ పేపర్‌ - 1, 14న కెమిస్ట్రీ, కామర్స్‌ పేపర్‌-2 పరీక్షలు నిర్వహిస్తారు.

ఒక్క నిమిషం నిబంధన...

ఇంటర్‌ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షా కేంద్రం లోకి అరగంట ముందు నుంచే అను మతించనుండగా 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్య మైనా అనుమతించబోమని అధికారులు తెలిపారు. ఆరోగ్య సమస్యల నివారణకు పరీక్షా కేంద్రం వద్ద ఆశా వర్కర్లను నియమిస్తామని, పోలీసు బందోబస్తు ఉం టుందని, ప్రశ్నాపత్రాలు పోలీస్‌స్టేషన్‌ నుంచి పరీక్షా కేంద్రానికి, ఆన్సర్‌ పేపర్లు పరీక్షా కేంద్రం నుంచి పోస్టాఫీసుకు పోలీసు బందోబస్తుతో తీసుకెళ్లాలని నిర్వాహకులకు అధికారులు సూచించారు.

జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలు...

జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశా రు. ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళశాల-జనగామ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల-జనగామ, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల-స్టేషన్‌ఘన్‌పూర్‌, ప్రభుత్వ జూని యర్‌ కళాశాల-నర్మెట, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల- దేవరుప్పుల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కొడకండ్ల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జఫర్‌గఢ్‌, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం-జనగామ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం-పల్లగుట్ట, సోషల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కాలేజీ-పాలకుర్తి, మోడల్‌ స్కూల్‌ జూనియర్‌ కాలేజ్‌-నమిలిగొండ, శ్రీ గాయత్రి జూనియ ర్‌ కళాశాల-జనగామ, ఎస్‌ఆర్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల-జనగామ, తేజస్వి జూనియర్‌ కళా శాల-జన గామ, ప్రెస్టన్‌ జూనియర్‌ కళాశాల-జనగామ, ఏబీవీ జూనియర్‌ కళాశాల ఏ, బీ సెంటర్లు-జనగామ, తెలం గాణ మైనారిటీ స్కూల్‌-జనగామ పరీక్షా కేంద్రా లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

నిర్వహణ ఇలా...

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు గాను మూడు సెట్ల ప్రశ్నాపత్రాలు సంబంధిత పోలీస్‌స్టేషన్లకు చేరుకున్నా యి. 18 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లను, 18 మంది డీవోలను అధికారులు నియమించారు. సీసీ కెమెరాల ముందే ప్రశ్నాపత్రాలను కవర్ల నుంచి బయటకు తీయాలని అధికారులు ఆదేశించారు. పరీక్షలు సవ్యం గా జరిగేందుకు ఒక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం, రెండు సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షిస్తాయి. వీరు కా కుండా డెక్‌ సభ్యులు, ఇంటర్‌ బోర్డు నుంచి హై లెవల్‌ కమిటీ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తాయి. ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఈ సంవత్సరం ప్రత్యేకాధికారుల ను నియమించారు. ప్రతి రెండు పరీక్షా కేంద్రాలకు ఒక ప్రత్యేకాధికారి విధులు నిర్వర్తించనున్నారు.

అనుమతి వీటికే..

విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను టీఎస్‌బీఐ వెబ్‌సై ట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలి. విద్యార్థితో హాల్‌ టికెట్‌, పెన్‌, పెన్సిల్‌, రబ్బర్‌, ఎగ్జామ్‌ ప్యాడ్‌, మ్యాథమెటికల్‌ పరికరాలు మాత్రమే పరీక్షా కేంద్రం లోకి అనుమతిస్తారు. నోటు బుక్కులు, సెల్‌ ఫోన్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని అధికారులు తెలిపారు.

ఒత్తిడి నియంత్రణకు టోల్‌ ఫ్రీ నంబరు

పరీక్షల సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండేందుకు ఇంటర్‌ బోర్డు టోల్‌ ఫ్రీ నంబరును అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు పడే మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు 14416 టోల్‌ ఫ్రీ నంబరు సంప్రదించాల్సి ఉంటుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా నిపుణులు తగు సలహాలు, సూచనలు అందిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో 9,139 మంది విద్యార్థులు...

ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 3,166 మంది జనరల్‌ స్ట్రీమ్‌ విద్యార్థులు, 1,197 మంది ఒకేషనల్‌ విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం లో 3578 మంది జనరల్‌ విద్యార్థులు, 1,198 మంది ఒకేషనల్‌ విద్యార్థు లతో మొత్తం 9,139 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచాలని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుం డా చూడాలని సంబంధిత అధికారులకు సూచిం చారు. అదేవిధంగా పరీక్షలు జరిగే ప్రాంతాలలో జిరా క్స్‌ సెంటర్లు, ఇంటర్‌నెంట్‌ కేంద్రాలు మూసి ఉంచా లని అధికారులు కోరారు.

పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం ...

- బైరి శ్రీనివాస్‌, డీఐఈవో, జనగామ.

పరీక్షలు పకడ్బందీగా నిర్వ హిస్తామని జనగామ డీఐఈ ఓ బైరి శ్రీనివాస్‌ అన్నారు. విద్యార్థులు గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దానిపై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరం లేదు. మానసిక ఒత్తిడి నియం త్రణకు టోల్‌ఫ్రీ నంబరులో సంప్రదించాలి.

Updated Date - Feb 26 , 2024 | 11:42 PM