Share News

అప్రమత్తంగా లేకుంటే.. మొదటికే మోసం

ABN , Publish Date - May 21 , 2024 | 11:48 PM

వేసవి చివరి దశకు చేరుకుంది. వానాకాల ఆగమనం త్వరలోనే ఉంది. రైతన్నలు వ్యవసాయానికి సన్నద్ధమవుతు న్నారు. యాసంగి ముగియగా ఖరీఫ్‌ పంటలు వేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తత అవసరమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమార్కులు, దళారుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తేనే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారు.

అప్రమత్తంగా లేకుంటే.. మొదటికే మోసం

రైతన్నలను వంచించేందుకు ‘నకిలీ’ల ప్రయత్నం

వానాకాలంపై అక్రమార్కుల ఫోకస్‌

నాసిరకం విత్తనాలు.. ఎరువులు అంటగట్టే అవకాశం

ప్రతి ఏటా నామమాత్రంగా సాగుతున్న తనిఖీలు

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 260 ఫర్టిలైజర్‌ షాపులు

గ్రామాల్లో అనుమతి లేని దుకాణాలు మరెన్నో

కృష్ణకాలనీ (భూపాలపల్లి), మే 21: వేసవి చివరి దశకు చేరుకుంది. వానాకాల ఆగమనం త్వరలోనే ఉంది. రైతన్నలు వ్యవసాయానికి సన్నద్ధమవుతు న్నారు. యాసంగి ముగియగా ఖరీఫ్‌ పంటలు వేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తత అవసరమంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అక్రమార్కులు, దళారుల బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తేనే వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని సూచిస్తున్నారు. లేదంటే మోసాలకు గురికావాల్సి వస్తుందని అంటున్నారు.

వానాకాలం వ్యవసాయ (ఖరీఫ్‌) పనులు మొదలు కాకముందే దళారులు, అక్రమార్కులు అదును కోసం వేచి చూస్తున్నారు. నాసిరకం విత నాలు, నిషేధిత మందు లను రైతులకు అంటగట్టేం దుకు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రతి ఏటా అన్నదాతలు వంచనకు గురవుతూనే ఉన్నారు. ఈ అక్రమాలపై కొరడా ఝళిపిస్తున్నామని వ్యవసాయ శాఖ, పోలీసు అధికారులు చెప్పుకుం టున్నా వారు సంయుక్తంగా నిర్వహించే తనిఖీలు నామమాత్రంగానే ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రహస్య ప్రదేశాల్లో సరుకు నిల్వ

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 260 ఫర్టిలైజర్‌ షాపులు ఉన్నాయి. వీటిల్లో కొన్ని దుకాణాల యజమానులు ఇప్పటికే గుట్టు చప్పుడు కాకుండా రహస్య ప్రదేశాల్లో నకిలీ సరుకును నిల్వ చేసినట్టు తెలుస్తోంది. మరికొందరు దళారులు నకి లీ, నిషేధిత విత్తనాలను గ్రామాల్లో దిగుమ తి చేసుకుంటున్నారని బహిరంగం గానే చర్చ సాగుతోంది. వీటిని రైతులకు అంటగట్టి సొమ్ము చేసు కొనేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

నిఘా పటిష్ఠం చేస్తేనే..

జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ ఆరం భంలో సంబంధిత అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వ హించి చేతులు దులుపుకుంటున్నా రనే ఆరోపణలు ఉన్నాయి. నాసిర కం విత్తనాలు, నిషేధిత, నకిలీ మం దులు విక్రయిస్తున్న వారిపై పకడ్బం దీ చర్యలు ఉంటడం లేదనే విమర్శ లు వస్తున్నాయి. ఖరీఫ్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో నకిలీలపై ప్రత్యేక దృష్టి పెట్టి, కఠిన చర్యలు తీసు కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం రైతన్నలకు ఊరట కలిగి చింది. ఇప్పటికైనా నకిలీల బెడద తప్పుతుం దని అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే.. ఈ దందాను అరికట్టేందుకు సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోబోతుం దోననే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రభు త్వం వెలువరించిన ప్రకటనతో అక్రమార్కు ల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది.

గతంలో తెరపైకి నకిలీల పర్వం..

జిల్లాలో గతంలో నకిలీల పర్వం అధికారుల తనిఖీల్లో బయటపడిన ఘటనలు ఉన్నాయి. నాసిరకం విత్తనాలతోపాటు నిషేధిత గ్లైఫోసెట్‌ గడ్డి మందును అధికారులు పలు సందర్భాల్లో స్వాధీనం చేసుకున్నారు. రేగొండలో రూ. లక్ష 50వేల పైచిలుకు విలువ గల 3.5 కిలోల మిర్చి విత్తనాలను పట్టుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల సుమారు రూ.12 లక్షల విలువ గల గ్లైఫోసెట్‌ గడ్డి మందును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే.. బయటపడ్డ నకిలీల బాగోతం కొన్నయితే, అధికారుల కనుసన్నల్లోంచి తప్పుకున్న ఘటనలు చాలానే ఉంటాయనే విమర్శలు జిల్లాలో లేకపోలేదు. కొంత మంది అధికారుల కనుసన్నల్లో దళారులు, అక్రమ వ్యాపారులు రైతులను మోసగిస్తూ మోసగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.

అప్రమత్తంగా లేకుంటే అంతే..

రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. గుర్తింపు పొందిన డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేయాలని అంటున్నారు. బీజీ-3 పేరుతో చెలామణి అవుతున్న హెచ్‌టీ పత్తి విత్తనాలకు అనుమతి లేదని, వాటిని కొనుగోలు చేయొద్దని అంటున్నారు. విత్తనాలు కొనేటప్పుడు దుకాణదారుడి పేరు, చిరునామాతో పాటు సీడ్‌ లైసెన్స్‌ నంబర్లు జీఎస్టీ నంబర్‌ ఉన్న రశీదులు మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. రశీదుపై విత్తన కంపెనీ పేరు, రకం, గడువు తేదీ, డీలర్‌ సంతకం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. పంటకాలం పూర్తయ్యే వరకు బిల్లు భద్రంగా దాచుకోవాలని, ఏదైనా నష్టం వాటిల్లితే పరిహారం కోసం ప్రయత్నం చేసుకునే వెసులుబాటు ఉంటుందని వివరిస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా లేకుంటే మోసాల బారిన పడాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

Updated Date - May 21 , 2024 | 11:48 PM