Share News

గురుకులం పిలుస్తోంది!

ABN , Publish Date - Jan 09 , 2024 | 11:16 PM

విద్యా వికాసానికి గురుకుల విద్యాలయాలు తోడ్పాటునందిస్తున్నాయి. పేదింటి బాల బాలికలకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తున్నాయి. చక్కటి విద్యాబోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన చదువులు, సన్నబియ్యంతో భోజనం, కాస్మోటిక్స్‌, ఉచిత దుస్తులు, బెడ్‌ షీట్స్‌, పుస్తకాలు, ఇలా అన్ని రకాల వసతులు కల్పిస్తోంది. చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లోనూ శిక్షణ ఇప్పిస్తోంది.

గురుకులం పిలుస్తోంది!
జఫర్‌గడ్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల

5వ తరగతిలో ప్రవేశాలకు ఆహ్వానం

నాణ్యమైన బోధన, మెరుగైన వసతులు

దరఖాస్తుకు ఈనెల 20 వరకు గడువు

ఫిబ్రవరి 11న ప్రవేశపరీక్ష

జిల్లాలో 16 పాఠశాలలు, 1280 సీట్లు

జఫర్‌గడ్‌, జనవరి 9: విద్యా వికాసానికి గురుకుల విద్యాలయాలు తోడ్పాటునందిస్తున్నాయి. పేదింటి బాల బాలికలకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందిస్తున్నాయి. చక్కటి విద్యాబోధనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. ప్రభుత్వం గురుకులాల్లో నాణ్యమైన చదువులు, సన్నబియ్యంతో భోజనం, కాస్మోటిక్స్‌, ఉచిత దుస్తులు, బెడ్‌ షీట్స్‌, పుస్తకాలు, ఇలా అన్ని రకాల వసతులు కల్పిస్తోంది. చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లోనూ శిక్షణ ఇప్పి స్తోంది. బోధనలో, సౌకర్యాల కల్పనలో కార్పొరేట్‌ బడులకు దీటుగా గురుకులాలు పనిచేస్తున్నాయి. వీటిలో ప్రవేశాన్ని అందిపుచ్చుకుంటే మంచి భవిష్యత్తును నిర్మించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, తెలంగాణ రెసిడెన్షియల్‌ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఎస్సీ (టీఎ్‌సడబ్ల్యుఆర్‌ఈఐఎస్‌), ఎస్టీ (టీటీడబ్ల్యుఆర్‌ఈఐఎస్‌), బీసీ (ఎంజెపీటీబీసీడబ్ల్యుఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థ (టీఆర్‌ఈఐఎస్‌) గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ఇంగ్లీషు మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరుతున్నాయి.

జిల్లాలో 16 గురుకులాలు - 1280 సీట్లు

జిల్లాలో మొత్తం 16 గురుకులాలు ఉండగా, అందులో ఎస్సీ గురుకులా లు 5, బీసీ 6, ఎస్టీ 4, తెలంగాణ రెసిడెన్షియల్‌ గురుకులం ఒకటి చొప్పున ఉన్నాయి. వీటిలో అన్నీ కలిపి బాలికలకు 9, బాలురకు 7 పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో గురు కులంలో 5వ తరగతిలో 80 సీట్ల చొప్పున (బాలికలకు 720, బాలురకు 560) మొత్తం 1,280 సీట్లు ఉన్నాయి. ప్రవేశపరీక్షలో విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.

అర్హతలు

విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభు త్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండాలి. ఇందుకు సంబంధించిన ఽస్టడీ సర్టిఫి కేట్‌ను ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ, విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతం రూ.2 లక్షలకు మించకూడదు.

దరఖాస్తు విధానం...

అర్హతలు గల విద్యార్థులు జనవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయా లి. ఇంటర్‌నెట్‌ లేదా మీ సేవా కేంద్రాల్లో నూ సంప్రదించవచ్చు. విద్యార్థి స్టడీ, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజు ఫోటో ను జతపర్చాల్సి ఉంటుంది. వీటి తో పాటు ఆన్‌లైన్‌లో రూ.100లు రుసుము చెల్లించాల్సి ఉం టుంది. ఆయా గురుకు లాల్లో ప్రవే శాలు పొందగోరే ఆసక్తి గల విద్యార్థులు హెచ్‌టీ టీపీ:///టీఎస్‌డబ్ల్యుఈఆర్‌ఐఎస్‌.ఇన్‌, హెచ్‌టీ టీపీ:///టీ జీసెట్‌.సీజీజీ. జీఓవీ, ఇన్‌, హెచ్‌టీటీపీ:///ఎంజెపీటీబీ సీడబ్ల్యు ఆర్‌ఈఐఎస్‌. తెలంగాణ.జీఓవీ.ఇన్‌, హెచ్‌టీటీపీ:/// టీజీటీ డబ్ల్యుగురుకులం, తెలంగాణ. జీఓవీ.ఇన్‌ అనే వెబ్‌సైట్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

ప్రవేశ పరీక్ష విధానం

ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో ఉంటుంది. పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం తెలుగు, ఇంగ్లీషు మీడియంలో ఉంటుంది. ఈ పరీక్షలో తెలుగు (20 మార్కులు), ఇంగ్లీషు (25), గణితం (25), మెంటల్‌ ఎబిలిటీ (10), పరిసరాల విజ్ఞానం (20 మార్కులు) సబ్జెక్టులలో నాలుగో తరగతి స్థాయిలో వంద ప్రశ్నలు ఉంటాయి.

ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష

అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. గిరిజన గురుకులాలతో పాటు తెలం గాణ రెసిడెన్షియల్‌, సోషల్‌ వెల్ఫేర్‌, మహాత్మాగాం ధీ జ్యోతిబాపూలేకు సంబంధించిన పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 11వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో పరీక్షను ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు.

గురుకులాల్లో నాణ్యమైన విద్య

- సమత, ప్రిన్సిపాల్‌, సాంఘిక సంక్షేమ బాలికల గురుకులం, జఫర్‌గడ్‌

గురుకులాల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నాం. ఉచిత వసతితో పాటు దుస్తులు, పుస్తకాలు, కాస్మెటిక్స్‌తో పాటు భోజనం అందిస్తున్నాం. 5వ తరగతిలో ప్రవేశం పొందితే బాల బాలికలు 10వ తరగతితో పాటు ఇంటర్‌ వరకు గురుకులాల్లోనే చదువుకోవచ్చు. విద్యార్థులకు ఆయా తరగతుల సబ్జెక్టులపై విషయ పరిజ్ఞానంతో పాటు కంప్యూటర్‌ విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాం. ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు దోహదం

శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల జిల్లా కో-ఆర్డినేటర్‌

పేద మధ్యతరగతి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు గురుకులాలు దోహదపడుతున్నాయి. బాలబాలికలకు ఆంగ్లమాధ్యమంలో కార్పొరేట్‌ స్థాయిలో గుణాత్మక విద్యతో పాటు విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇచ్చి మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నాం. ఎంతో మంది విద్యార్థులు విద్య, ఉద్యోగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతూ ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 11:16 PM