సోమన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:31 PM
జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్ర మైన పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయంలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

నేటి నుంచి ప్రారంభం.. ఐదు రోజులపాటు వేడుకలు
రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల రాక
ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు
పాలకుర్తి, మార్చి 6: జిల్లాలోనే అతిపెద్ద పుణ్యక్షేత్ర మైన పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయంలో ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్స వాలకు దేవాదా య, ధర్మాదా య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 7న అంకు రార్పన, ధ్వజారోహణం, 8న స్వామి వారి కల్యాణ మహోత్సవం, 9న రథోత్సవం, బండ్లు తిరుగుట, 10న డోలారోహణం, వసంతోత్సవం, పుష్ప యాగం, సదస్యం, పల్లకీ సేవ, 11న అగ్నిగుండాలతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి.
వివిధ రాష్ట్రాల భక్తుల రాక
శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి బ్రహోత్సవాలకు ప్రతి ఏడాది తెలంగాణ నుంచే గాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ర్టాల భక్తులు వంద లాదిగా తరలివచ్చి స్వామి వారలను దర్శించుకుంటారు. అంతేగాకుండా విదేశాల నుంచి కూడా తెలుగు వారు తరలివస్తారని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.
ఆలయ చరిత్ర..
తెలంగాణలో రెండవ యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెం దిన శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం బ్ర హ్మోత్సవాలకు ముస్తాబైంది. జనగామ జిల్లాలోనే పాల కుర్తి క్షీరగిరికి ప్రత్యేక చర్రిత ఉంది. శ్రీ సోమేశ్వర లక్ష్మీ నర్సింహస్వామి దివ్య క్షేత్రంలో ఉన్న లింగం స్వయంభు వు. గ్రామానికి వెలుపల పర్వతాగ్రముపైనున్నది. ము నులు తపస్సు చేసిన సిద్ధ ప్రదేశం. ఇక్కడ నడినిశీధి ఆలయ గుహల నుంచి ఓంకార ప్రణవనాదం వినిపి స్తుందని భక్తుల విశ్వాసం. అదృశ్య రూపంలో ఉన్న సిద్ధ పురుషులు అర్థరాత్రి వేళలో స్వామి వారిని అర్జిం చడానికి వస్తారని ప్రతీతి. ఈ క్షేత్రంను దర్శించు కున్న వారికి దివ్యవైన ఫలితం లభిస్తుంది. దక్షిణ భారతదేశం లోనే ఎక్కడాలేని విధంగా పాలకుర్తిలోనే క్షీరగిరి గుట్ట పై వేర్వేరు గుహల్లో ఒక గుహలో శివుడు(సోమేశ్వరుడి)గా మరో గుహలో విష్ణువు (లక్ష్మీనర్సింహస్వామి)గా వెలసి ఉన్నారు. శివకేశవులకు భేదం లేదని ప్రభోదిం చుచున్నారు. అందుకే హరిహర క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఈ దివ్య క్షేత్రం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పంచాహ్నిక దీక్షతో శైవాగం, వైధికాగం సంప్రదా యాను సారంగా పూజలు నిర్వహించడం జరుగు తుంది. ఈ దేవాలయంలో సూర్యభగవానుడి విగ్రహం కూడా కొలువై ఉంది.
రక్షక భటులుగా తేనెటీగలు..
శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి గుట్టపై ఉన్న తేనెటీగలు స్వామి వారలకు రక్షక భటులుగా ఉంటా రని ప్రతీతి. ముఖ్యంగా స్వామి వారిని దర్శించుకు నేందుకు వచ్చే భక్తులు ఫుణ్య స్నానాలతో పవిత్రంగా ఉండాలని, లేని ఎడల తేనెటీగలు వెంబడించిన సంఘటనలు అనేకం ఉన్నాయని భక్తుల విశ్వాసం. ఇప్పటికి భక్తులు నిష్ఠతో స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో స్వామి వారలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తుంటారు.
ఏర్పాట్లు పూర్తి చేశాం..
- లక్ష్మీప్రసన్న, ఈవో పాలకుర్తి దేవస్థానం
శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి బ్రహోత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నాం. వరంగల్, జనగామ, తొర్రూరు, సూర్యాపేట డిపోల నుంచి పాలకుర్తికి జాతర స్పెషల్ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. గుట్ట సమీపంలో భక్తులకు నిరంతరం తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పనకు కృషి చేస్తాం. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేశాం. గుట్టపైన దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్ల కోసం బారీకేడ్లు ఏర్పాటు చేశాం.
బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా
పాలకుర్తి, మార్చి 6: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. పాలకుర్తిలోని సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో బ్రహోత్సవాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గుట్ట కింది భాగంలో చలువ పందిళ్లు, తాగునీటి నల్లాలను పరిశీలించారు. ఘాట్ రోడ్డు ద్వారా గుట్టపైకి ఎక్కి క్యూలైన్ల కోసం ఏర్పాటు చేసిన బారీకేడ్లను, చలువ పందిళ్లను పరిశీలించారు. ఈ ఐదు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో కోత ఉండవద్దని అధికారులను ఆదేశించారు. పంచాయతీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బందితో శుభ్రం చేయించాలన్నారు. భక్తుల కోసం ఆరోగ్యశాఖ క్యాంపును ఏర్పాటు చేసి 24 గంటలు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. జాతరలో ఎలాంటి ఘటనలు జరుగకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. టీఎస్‌ఆర్టీసీ బస్సులను గుట్ట వరకు నడిపించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ వెంకటేశం, ఎంపీడీవో రాములు, ఈవో లక్ష్మీప్రసన్న, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ ప్రశాంతి ఉన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తుల కౌంటర్‌ను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి తనిఖీ చేశారు..