బాప్‌రే..!
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:38 AM
జిల్లాలో ఎండ లు దంచికొడుతున్నాయి. వేసవి తీవ్రతతో జిల్లా అంత టా నిప్పుల కొలిమిలా మారింది. వేసవి ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం దాల్చడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకీ పెరుగు తున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు
ఉదయం నుంచే ఎండ తీవ్రత షురూ
వేడిగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి
41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
జనగామ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండ లు దంచికొడుతున్నాయి. వేసవి తీవ్రతతో జిల్లా అంత టా నిప్పుల కొలిమిలా మారింది. వేసవి ఆరంభంలోనే భానుడు ఉగ్రరూపం దాల్చడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజురోజుకీ పెరుగు తున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో వారం రోజులుగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మండుతున్న ఎండలతో ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగలు ఎండ, రాత్రి పూట ఉక్కపోతతో జనం సతమతమవుతు న్నారు. ఎండల వల్ల జనం వడదెబ్బకు గురవుతున్నారు. వేసవి తీవ్రత పెరగడంతో జిల్లా యంత్రాంగం అప్రమ త్తమైంది. ఎండలు మరింత ముదిరే అవకాశం ఉండ డంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఇతర మందులను అందుబాటులో ఉంచారు.
జిల్లాలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత
- జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతం గా పెరిగిపోతున్నాయి. సాధారణ స్థితిని దాటి ఉష్ణో గ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలో సోమ, మంగళ వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో మంగళవారం చిల్పూరు మండలం మల్కాపూర్‌లో అత్యధికంగా 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే మే నెలలో ఏ విధంగా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు.
బయటకు రావాలంటేనే భయం
ఎండల తీవ్రతల వ ల్ల ప్రజలు బయటకు రావాలం టేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏదైనా అత్యవసర పనులు ఉంటేనే తప్ప జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఉదయం 7 గంటల నుంచే సూర్యుడు వస్తుండగా 11 గంటలకే చుక్కలు చూపించేతంగా ఎండ తీవ్రమవుతోంది. మధ్యాహం పూట ప్రజలు బయటకు రావడమే లేదు. ఎండ తీవ్రతకు భయపడి మధ్యాహ్నం వేళల్లో పనుల్ని వాయిదా వేసుకుంటున్నా రు. సాయంత్రం 6 గంటలకు కూడా ఎండ ఉంటుం డడంతో వాతావరణం చల్లబడిన తర్వాతే జనం బయ టకు వస్తున్నారు. దీంతో ఇతర సీజన్లలో నిత్యం రద్దీగా కన్పించే రోడ్లు, వీధులన్నీ మధ్యాహ్నం పూట జనసంచా రం లేక బోసిగా కన్పిస్తున్నాయి.
వేసవి తాపం నుంచి రక్షణకు..
ఎండల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు కూలర్లు, ఏసీలను వాడుతున్నారు. ఎండలు దంచి కొడుతుండడంతో వాటి నుంచి ఉపశమనం పొందేందుకు జనం వివిధ మార్గాలను ఎంచు కుంటు న్నారు. శీతల పానీయాలు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటు న్నారు. ఎండ తీవ్రతతో కూలర్లు, ఏసీల అమ్మకాలు పెద్ద మొత్తంలో పెరిగాయి. నిన్న మొన్నటి వరకు సంప న్నులు మాత్రమే ఏసీలు కొనుగో లు చేయగా నే డు ఎగువ మధ్యతరగతి పేదలు సైతం పెద్ద సంఖ్యలో ఏసీలను విని యోగిస్తున్నారు. అంత స్థోమత లేనివారు కూలర్ల కిందే గడుపుతున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ఎండలు దంచి కొడుతున్నందున ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో పనిచేసే రైతులు, భవన నిర్మాణ, ఉపాధి హా మీ కూలీల వంటి వారు జాగ్రత్తగా ఉండాలని చెబు తున్నారు. ఎండలో పనిచేయడం, తిరగడం వల్ల శరీరం లోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్ర మాదం ఉందని, ఈ క్రమంలో క్రమం తప్ప కుండా నీటిని తాగుతూ ఉండాలని, వీటితో పాటు పండ్ల రసాలు, ఓఆర్‌ఎస్ ద్రావణం వంటివి తీసుకుంటే వడదెబ్బ తాక కుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
తగు జాగ్రత్తలు తీసుకోవాలి..
వైద్యాధికారులకు కలెక్టర్ ఆదేశాలు
వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జిల్లాలోని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండా లని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. కలెక్ట రేట్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో వైద్యాఽ దికారులకు పలు సూచనలు చేశారు. మండల కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాల స్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి వారికి వేసవి తీవ్రత, వడదెబ్బ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల న్నారు. పీహెచ్‌సీలు, సబ్‌సెంటర్లు, గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాలు, బస్టాండులు, రైల్వే స్టేష న్లు, పోలీస్ స్టేషన్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఉపాధి హామీ పని జరిగే చోట సరిపడా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవీ ప్లూయిడ్స్, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వడదెబ్బ కేసులకు సత్వరమే మెరుగైన వైద్యం అందించా లని ఆదేశించారు. ఈ సం దర్భంగా ‘వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత ్తలు’ ఈ అంశంపై రూపొందించిన వాల్‌పోస్టర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు.