Share News

Hyderabad: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహిత భర్త హతం

ABN , Publish Date - Jan 17 , 2024 | 02:55 PM

వివాహిత తనతో రాలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది ఆమె భర్తను హతమార్చిన ఘటన ఫిల్మ్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహిత తన భర్తతో కలిసి ఫిల్మ్ నగర్ లో నివసిస్తోంది. ఆమెకు అంతకుముందే అద్నాన్ అనే యువకుడితో పరిచయం ఉంది.

Hyderabad: ప్రేమోన్మాది ఘాతుకం..  వివాహిత భర్త హతం

హైదరాబాద్: వివాహిత తనతో రాలేదన్న కోపంతో ఓ ప్రేమోన్మాది ఆమె భర్తను హతమార్చిన ఘటన ఫిల్మ్ నగర్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వివాహిత తన భర్తతో కలిసి ఫిల్మ్ నగర్ లో నివసిస్తోంది. ఆమెకు అంతకుముందే అద్నాన్ అనే యువకుడితో పరిచయం ఉంది. భర్త గౌస్ ఆమెను ఉన్నత చదువులకోసం లండన్ పంపగా.. అక్కడే చదువుకుంటున్న అద్నాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. చదువులు పూర్తయ్యాక ఆమె హైదరాబాద్ తిరిగి వచ్చేసింది.

అద్నాన్ కూడా వచ్చేశాడు. ఈ క్రమంలో ఆమె తన భర్తను వదిలిపెట్టి రావాలని ప్రియుడు ఒత్తిడి చేశాడు. ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను కిడ్నాప్ చేసేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఫిల్మ్ నగర్ లో ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను అపహరించడానికి ప్రయత్నిస్తుండగా.. అద్నాన్ అడ్డుగా వచ్చాడు. ఆ ఉన్మాది గౌస్ ని కిరాతకంగా చంపి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 17 , 2024 | 03:44 PM