Palm Oil: తెలంగాణ పామాయిల్ ఓఈఆర్ 19.42%
ABN , Publish Date - Nov 14 , 2024 | 04:30 AM
పామాయిల్ సాగులో తెలంగాణ రికార్డు సృష్టించింది. 19.42ు ఓఈఆర్(గెలల నుంచి వెలికి తీయగల నూనె శాతం)తో 2024-25 సంవత్సరానికిగాను దేశంలో అత్యధిక ఉత్పాదకత సాఽధించిన రాష్ట్రంగా నిలిచింది.
2024-25 పంటకు నిర్ధారణ.. దేశంలోనే అత్యధికం
టన్ను గెలలకు రూ.160 పెరగనున్న రేటు.. రైతుల హర్షం
అశ్వారావుపేట, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): పామాయిల్ సాగులో తెలంగాణ రికార్డు సృష్టించింది. 19.42ు ఓఈఆర్(గెలల నుంచి వెలికి తీయగల నూనె శాతం)తో 2024-25 సంవత్సరానికిగాను దేశంలో అత్యధిక ఉత్పాదకత సాఽధించిన రాష్ట్రంగా నిలిచింది. దేశంలో పామాయిల్ సాగు చరిత్రలో ఇంత ఓఈఆర్ ప్రకటించడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ అధికారులు, ఆయిల్ పామ్ రైతు సంఘం నేతలతో బుధవారం జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సరానికి తెలంగాణ పామాయిల్ ఓఈఆర్‌ను నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రైతు సంఘం నాయకులు వివరాలను వెల్లడించారు.
ఓఈఆర్ పెరగడంతో తెలంగాణలో ఆయిల్‌పామ్ ఒక్కో టన్ను గెలలకు రూ.160 చొప్పున ధర పెరుగుతుంది. గతేడాది తెలంగాణలో పామాయిల్ ఓఈఆర్ 19.17శాతంగా ఉంది. ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీల్లో వచ్చిన నూనె దిగుబడిని బట్టి కాకుండా, ఆయిల్ పామ్ ఉత్పత్తిలో రెండేళ్ల సరాసరి ఆధారంగా ఓఈఆర్‌ను ప్రకటించాలని ఆల్ ఇండియా ప్రైవేటు ఫ్యాక్టరీల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో లేఖ రాసింది. ఈ అభ్యంతరాన్ని పక్కనపెట్టి అధికారులు ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీల్లో వచ్చే నూనె దిగుబడి ఆధారంగానే ఓఈఆర్‌ను నిర్ధారించారు. దీనిపై ఆయిల్ పామ్ రైతులు హర్షం వ్యక్తం చేశారు.