Share News

TS News: మద్యం అమ్మకాల్లో దుమ్మురేపిన తెలంగాణ

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:18 PM

పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్ అయితే అమ్మకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది.

TS News: మద్యం అమ్మకాల్లో దుమ్మురేపిన తెలంగాణ

హైదరాబాద్: పండగ ఏదైనా తెలంగాణలో బీర్లు పొంగాల్సిందే. ఇక న్యూఇయర్ అయితే అమ్మకాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సర వేడుకల సందర్బంగా మద్యం అమ్మకాల్లో తెలంగాణ దుమ్మురేపింది. నిన్న ఒక్కరోజే 19 ప్రభుత్వ డిపోల నుంచి లక్ష 30 వేల కేసుల లిక్కర్, లక్ష 35 వేల కేసుల బీర్ అమ్మకాలు జరిగాయట. నిన్న ఒక్కరోజే ప్రభుత్వానికి రూ.125 కోట్ల ఆదాయం సమకూరిందట.

ఈ సారి డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మధ్యాహ్నం నుంచే వైన్స్‌ల వద్ద రద్దీ కనిపించింది. మూడు రోజుల్లో లిక్కర్ అమ్మకాలు ఆకాశాన్నంటాయి. డిసెంబర్ 29, 30, 31వ తేదీల్లో రూ.658 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు సమాచారం. మొత్తంగా 3 రోజుల్లో 4.76 లక్షల లిక్కర్ కేసులు... 6.31 లక్షల బీర్‌ కేసులు అమ్ముడయ్యాయి. ఈ మూడు రోజుల్లో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది.

Updated Date - Jan 01 , 2024 | 12:24 PM