Share News

TS News: న్యామత్ నగర్‌లో ప్రారంభమైన తగ్లిబే జమాతే ఇస్తేమా

ABN , Publish Date - Jan 06 , 2024 | 10:41 AM

పరిగి మున్సిపల్ పరిధిలోని న్యామత్ నగర్‌లో తగ్లిబే జమాతే ఇస్తేమా ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. 6,7,8 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 2 వందల ఎకరాల్లో సభ ఏర్పాట్లు జరిగాయి.

TS News: న్యామత్ నగర్‌లో ప్రారంభమైన తగ్లిబే జమాతే ఇస్తేమా

వికారాబాద్: పరిగి మున్సిపల్ పరిధిలోని న్యామత్ నగర్‌లో తగ్లిబే జమాతే ఇస్తేమా ప్రారంభమైంది. రెండు రాష్ట్రాల ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు. 6,7,8 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 2 వందల ఎకరాల్లో సభ ఏర్పాట్లు జరిగాయి. జిల్లాల వారీగా నిర్వాహకులు బ్లాక్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమం సవ్యంగా జరిగేలా అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. తాగేందుకు మిషన్ భగీరథ నీళ్ళు, నిరంతరాయంగా ఆయా శాఖల అధికారులు విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. ఇస్తేమా సభ ఏర్పాట్లను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, నాంపల్లి మాజీ ఎమ్మెల్యే ఫెరోజ్ ఖాన్ పరిశీలించారు.

Updated Date - Jan 06 , 2024 | 10:41 AM