TG Minister Seethakka: శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి సీతక్క
ABN , Publish Date - Dec 31 , 2024 | 10:25 PM
Sri Teja: కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మంత్రి సీతక్క పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్, డిసెంబర్ 31: పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని తెలంగాణ మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆమె పరామర్శించారు. అనంతరం మంత్రి సీతక్క విలేకర్లతో మాట్లాడుతూ.. వెంటిలేటర్ చికిత్స నుంచి శ్రీతేజ్ బయటకి వచ్చాడన్నారు.
శ్రీతేజ్ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అతడికి చికిత్స అందిస్తున్న వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని చూసి ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌కు మంత్రి సీతక్క ధైర్యం చెప్పారు. సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
అలాగే తమ శాఖకు చెందిన ప్రత్యేక అధికారిని నియమించి.. శ్రీతేజ్‌కు అందుతోన్న చికిత్సను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుని బయటికి రావాలని కోరుకుంటున్నామని చెప్పారు. స్పెషల్ కేర్ తీసుకొని మెరుగైన చికిత్స అతడికి అందించాలని ఇప్పటికే వైద్యులను ఆదేశించామని గుర్తు చేశారు.
శ్రీతేజ్ సంతోషంగా బయటికి వస్తాడన్న నమ్మకం తమకు ఉందని స్పష్టం చేశారు. అతడి ప్రాణాలను కాపాడేందుకు ఇటు ప్రభుత్వం.. అటు వైద్యులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకుంటాడన్న ఆశతో తాము ఉన్నామని వెల్లించారు. నూతన సంవత్సరంలో చిన్నారి శ్రీతేజ్ ఆరోగ్యవంతుడై తిరిగి వస్తారన్న నమ్మకం తమకు ఉందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ పర్యటనలో మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ.. మంత్రి సీతక్క వెంట ఉన్నారు.
Also Read: సిట్ సభ్యులపై విమర్శలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: మీ బ్యాగు తగిలించుకొన్న తీరే.. మీరేమిటో చెబుతోంది
Also Read: రహదారిపై ఆగిన కారు.. రంగంలోకి ఎద్దులు
డిసెంబర్ 04వ తేదీన హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని అభిమానులతో వీక్షించేందుకు హీరో అల్లు అర్జున్ విచ్చేశారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..
Also Read: గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
దీంతో అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతున్నాడు. మరోవైపు హీరో అల్లు అర్జున్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడు జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. ఇక రేవతి కుటుంబానికి హీరో అల్లు అర్జున్‌తోపాటు పుష్ప చిత్ర నిర్మాత, దర్శకులు రూ. 2 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
For Telangana News And Telugu News