Share News

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:03 AM

యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని ఘట్‌కుసర్‌ డీఐ శ్రీనివాస్‌ అన్నారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఘట్‌కేసర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ఘట్‌కేసర్‌, ఫిబ్రవరి 29: యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని ఘట్‌కుసర్‌ డీఐ శ్రీనివాస్‌ అన్నారు. మాదకద్రవ్యాల నివారణకు అనురాగ్‌ విద్యాసంస్థకు చెందిన ఎన్‌ఎ్‌సఎస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు మాదక ద్రవ్యాల నివారణపై ఘట్‌కేసర్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్బంగా స్థానిక అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మత్తుపదార్థాల వాడకం సరదాగా అలవాటై వ్యసనంగా మారే ప్రమాదముందన్నారు. చెడు వ్యసనాలకు బానిస కావద్దన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శేఖర్‌, నవీన్‌, మధుకర్‌, శ్రీనివాస్‌, ఎన్‌ఎ్‌సఎస్‌ వాలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:03 AM