Share News

యువకులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:35 PM

యువకులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోటటి వెంకన్న సూచించారు. ఆదివారం మండల పరిధిలోని కంకల్‌ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు.

యువకులు అన్ని రంగాల్లో రాణించాలి
విగ్రహావిష్కరణలో ప్రజాకవి గోరటి వెంకన్న

-ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

పూడూరు, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): యువకులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోటటి వెంకన్న సూచించారు. ఆదివారం మండల పరిధిలోని కంకల్‌ గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకన్న విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడారు. స్వామివివేకానంద ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయులని అన్నారు. యువకులు లక్ష్యాన్ని ఏర్పరుకుని ముందుకు సాగాలని సూచించారు. క్రమశిక్షణతో మెలగాలని, ఏకాగ్రత, శారీరక దారుఢ్యం, తల్లిదండ్రులు, పెద్దలపట్ల గౌరవాన్ని కలిగి ఉండాలని అన్నారు. ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత అవసరమని, ప్రశాంతత కలిగి ఉన్నప్పుడే లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటామన్నారు. కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 11:35 PM