ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 28 , 2024 | 11:34 PM
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోమిన్‌పేట్ మండల పరిధిలో చోటుచేసుకుంది.

మోమిన్‌పేట్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మోమిన్‌పేట్ మండల పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు, ఎస్‌ఐ అరవింద్‌కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టేకులపల్లికిచెందిన పులిమద్ది యాదయ్య కుమారుడు కృష్ణ(24) కుటుంబ పోషణకు చేసిన అప్పులపై నాలుగు నెలల కిందట తల్లిదండ్రులు, భార్యతో కలిసి శంకర్‌పల్లి మండలంలోని టంగుటూరుకు వెళ్లి ఓ ఫాంహౌ్‌సలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన ఉదయం పనికి వెళ్తున్నానని కుటుంబసభ్యులతో చెప్పి బైక్‌పై బయల్దేరివెళ్లాడు. కుటుంబపోషణకు చేసిన అప్పులు, ఆర్థికసమస్యలతో మనస్తాపానికి గురైన కృష్ణ టేకులపల్లి శివారులో ఉన్న అయ్యమ్మ పెద్ద చెరువు కట్టపై బైక్ ఉంచి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి 10నెలల కిందట వివాహమైంది. మృతుడి తండ్రి యాదయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తంమర్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి కుటుంబసభ్యులకు అప్పగించారు.