Share News

ప్రజా సంక్షేమానికి కృషి : సబితారెడ్డి

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:38 AM

ఎల్లవేళలా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని మహేశ్వరం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమానికి కృషి : సబితారెడ్డి

కందుకూరు, జూన్‌ 16: ఎల్లవేళలా ప్రజా సంక్షేమానికి కృషి చేస్తానని మహేశ్వరం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. మండలంలోని కందుకూరు గ్రామానికి చెందిన కొమ్మగళ్ళ జ్యోతి ఇటీవల అనార్యోంతో బాధపడుతుండగా మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం ప్రభుత్వం నుంచి రూ.లక్షా20వేల ఎల్వోసీని సబితారెడ్డి మంజూరు చేయించింది. ఈమేరకు ఆదివారం బాధిత కుటుంబ సభ్యులకు సబితారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజల సంక్షేమానికి తాను ప్రతి నిత్యం ముందుండి పనిచేస్తానని అన్నారు. ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి, నాయకులు తాళ్ల కార్తీక్‌, బొక్క దీక్షిత్‌రెడ్డి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 12:38 AM