Share News

కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:36 PM

ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం ఆమనగల్లు మున్సిపల్‌ కార్మికులు ఆందోళన చేపట్టారు.

కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
ఆమనగల్లులో ర్యాలీ నిర్వహిస్తున్న మున్సిపల్‌ కార్మికులు

ఆమనగల్లు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం ఆమనగల్లు మున్సిపల్‌ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్‌ - శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. పని గంటలు తగ్గించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అనంతరం సీడీఎంఏ కార్యాలయం ఎదుట తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి కార్మికులు తరలివెళ్లారు. కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు వగ్గు రవి, హంసమ్మ, యాదమ్మ, సురేశ్‌, శ్రీను, సుగుణమ్మ, విజయ్‌, గోపాల్‌, పట్టాభి, నర్సింహ్మ, ప్రశాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:36 PM