Share News

పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:17 AM

రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి మేలు జరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధికి కృషి
కసిరెడ్డిని సన్మానిస్తున్న ఎఫ్‌ఎ్‌సవో వెంకట్‌నారాయణ

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, జనవరి 11 : రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి మేలు జరిగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు, కడ్తాల మండలాల పరిధిలో గురువారం ఎమ్మెల్యే పర్యటించారు. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు చోట్ల 2024 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. కసిరెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్బంగా కసిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేఎల్‌ఐ డీ-82 కాల్వ అసంపూర్తి పనులు పూర్తి చేయించి వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల పరిధిలోని 35 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.16 కోట్ల విడుదలకు సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకుపోయినట్లు చెప్పారు. ఆమనగల్లు మున్సిపాలిటీ ఫుడ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ వెంకట్‌ నారాయణ, పీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివా్‌సగౌడ్‌, ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సింహ, కాంగ్రెస్‌ మండలాధ్యక్షులు బీచ్యనాయక్‌, ప్రభాకర్‌రెడ్డి, జగన్‌, నాయకులు భాస్కర్‌ రెడ్డి, హన్మనాయక్‌, శ్రీకాంత్‌ రెడ్డి, యాదగిరిరెడ్డి, శేఖర్‌గౌడ్‌, పాలకుర్ల రాములు, చేగూరి వెంకటేశ్‌, గురిగళ్ల లక్ష్మయ్య, కృష్ణానాయక్‌, హీరాసింగ్‌, ఫరీద్‌, వస్పుల శ్రీకాంత్‌, నాజర్‌, అలీం, ఖాదర్‌ఖాద్రీ, తులసీరామ్‌ నాయక్‌, జవహరలాల్‌ నాయక్‌, మెకానిక్‌ బాబా, విజయ్‌రాథోడ్‌, శ్రీను, తదితరులున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:17 AM