Share News

మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:28 PM

రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలి
దౌల్తాబాద్‌లో సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి

దౌల్తాబాద్‌, ఫిబ్రవరి 1: రాజకీయ పార్టీలు మహిళలకు చట్టసభల్లో అవకాశం కల్పించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐదేళ్ల పాటు మహిళలు స్థానిక సంస్థల్లో పదవుల్లో ఉండి వాటికి వన్నె తెచ్చేలా పని చేశారని చెప్పారు. గతంలో ఎమ్మెల్యేగా పట్నం నరేందర్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ప్రస్తుతం కొడంగల్‌ నుంచి గెలిచిన రేవంత్‌రెడ్డి సీఎం కావడంతో నియోజకవర్గం అభివృద్ధి దిశగా దూసుకువెళ్తుందన్నారు.

సర్పంచ్‌లకు సన్మానం

మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాలులో జరిగిన సన్మాన కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొని సర్పంచ్‌లను సన్మానించారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఎంపీపీ విజయ్‌కుమార్‌, జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌, వైస్‌ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కేశవరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:28 PM