Share News

మహిళలు అన్నింటా ప్రగతిని సాధించాలి

ABN , Publish Date - Jan 12 , 2024 | 11:51 PM

మహిళలు అన్నింటా ప్రగతిని సాధించాలని పాఠశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ నీరజమైకెల్‌ పిలుపునిచ్చారు.

మహిళలు అన్నింటా ప్రగతిని సాధించాలి
శామీర్‌పేట: ముగ్గులు వేస్తున్న విద్యార్థినులు

శామీర్‌పేట, జనవరి 12: మహిళలు అన్నింటా ప్రగతిని సాధించాలని పాఠశాల కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ నీరజమైకెల్‌ పిలుపునిచ్చారు. తూంకుంట మున్సిపల్‌ పరిధిలోని దేవరయాంజాల్‌లోని సెంట్‌ మేరీస్‌ పాఠశాల్లో శుక్రవారం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను నిర్వహించారు. విజేతలకు పాఠశాల ప్రిన్సిపాల్‌ నీరజమైకెల్‌ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాఽధ్యాయులు పాల్గొన్నారు.

కీసర రూరల్‌: నాగారం మున్సిపాలిటీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. మున్సిపల్‌ పరిధిలోని పలుకాలనీల్లో, సెరినిటీ పాఠశాల్లో శుక్రవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. సెరినిటీ పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. నాగారం మున్సిపాలిటీ 14వ వార్డులో నిర్వహించిన ముగ్గుల పోటీలకు చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి పాల్గొని విజేతలను ఎంపిక చేసి, బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మల్లే్‌షయాదవ్‌, కౌన్సిలర్‌ శ్రీనివా్‌సగౌడ్‌, సెరినిటీ స్కూల్‌ కరెస్పాండెంట్‌ జంగిరెడ్డి, బోధనా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మేడ్చల్‌ టౌన్‌: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని సేయింట్‌ పీటర్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు ముగ్గల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి టీ.వీ.రెడ్డి ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.శ్రీలత, అకాడమిక్‌ డైరెక్టర్‌ సరోజారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌రెడ్డి, పీఆర్‌వో రవి సుధాకర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా క్రిష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్‌ శ్రీనివా్‌సరెడ్డి, ప్రిన్సిపాల్‌ దీపికరెడ్డిలతో పాటు ఉపాఽధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

తాండూరు: తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్‌ ఆలయ ఆవరణలో క్రిష్ణవేణి కాన్సెప్ట్‌ పాఠశాల విద్యార్థులు శుక్రవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. హరిదాసులు బసవన్ణ, భోగిమంటలు, గొబ్బెమ్మలు, రంగవళ్ళులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ విశిష్టతపై ప్రిన్సిపాల్‌ ప్రశాంత్‌, డైరెక్టర్‌ సతీష్‌, విద్యార్థులకు వివరించారు.

Updated Date - Jan 12 , 2024 | 11:51 PM