Share News

రామయ్యగూడ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం

ABN , Publish Date - Dec 30 , 2024 | 12:11 AM

రామయ్యగూడలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు దిశ కమిటీ సభ్యుడు డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు.

రామయ్యగూడ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం
రామయ్యగూడ పర్యటనలో బీజేపీ నాయకులు

వికారాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రామయ్యగూడలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు దిశ కమిటీ సభ్యుడు డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. మునిసిపల్‌ పరిధిలోని రామయ్యగూలో ఆదివారం బీజేపీ నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృత్‌ పథకం ద్వారా మునిసిపాలిటీకి రూ.12కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. రామయ్యగూడలో 5 రోజులుగా మిషన్‌ భగరీథ నీరు రాలేదని ఇబ్బందులు పడుతున్నారన్నారు. బోరు సైతం పాడైందని, రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయని రోడ్లు వెడల్పు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. కాలనీలో పర్యటించిన మేము సమస్యలన్నింటిని మునిసిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, ప్యాట శంకర్‌, అమర్‌, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:11 AM