శంషాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Oct 06 , 2024 | 12:06 AM
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పట్టణంలో పురపాలక సంఘం నూతన భవనాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిలతో కలసి మంత్రి శనివారం ప్రారంభించారు.
ఐటీ మంత్రి శ్రీధర్ బాబు
శంషాబాద్, అక్టోబరు 5 : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిసర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పట్టణంలో పురపాలక సంఘం నూతన భవనాన్ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిలతో కలసి మంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శంషాబాద్ ప్రాంతంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్‌ను కోరుతామని చెప్పారు. రోడ్ల అభివృద్ధికి కేంద్రం సహకారం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులను గత రాష్ట్ర ప్రభుత్వం సరిగా వాడుకోలేదన్నారు. శంషాబాద్ ప్రాంతంలోని రహదారుల విస్తరణకు శ్మశాన వాటికలు అడ్డంకిగా మారాయని, త్వరలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో టీయూఎ్‌ఫఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మామహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండిగోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.