పరిగిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:58 PM
పరిగి మునిసిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

పరిగి, జూలై 28: పరిగి మునిసిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగిలోని మునిసిపల్‌లో ఆదివారం 55మంది బాధిత కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మునిసిపల్ అధికారులు, కౌన్సిలర్లతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఇప్పటికే పరిగి మునిసిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పరిగి పట్టణంలో ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మాణానికి డిజైనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో త్వరలో సమావేశం నిర్వహించి సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్మన్ ఎం.అశోక్, కమిషనర్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వనమహోత్సవంలో భాగస్వాములవ్వాలి
ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే అన్నారు. పరిగి మునిసిపల్ పరిధిలోని నాల్గవ వార్డులో మనమహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి మొక్కలు నాటి, వాటిని పెంచే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ సుధీర్, మున్సిపల్ చైర్మన్ ఎం.అశోక్, కమిషనర్ వెంకటయ్య, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎం.లాల్‌కృష్ణప్రసాద్, కార్యదర్శి కె.హన్మంత్, పార్టీ మండల అధ్యక్షుడు బి.పరుశరాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇ.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వీరశైవలింగాయత్ భవనానికి నిధులివ్వండి
పరిగిలో వీరశైవలింగాయత్ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు ఇవ్వాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పరిగి ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సంఘం వీరశైవలింగాయత్ తాలుకా అధ్యక్ష్యకార్యదర్శులు గాండ్ల శివరాజు, మల్లేశంలు మాట్లాడుతూ, పరిగిలో రుద్రభూమి కోసం స్థలం కేటాయించాలని కోరారు. అన్ని దేవాయాల కమిటీల్లో ప్రత్యేక స్థానం కల్పించాలని కోరారు. పరిగి నుంచి శ్రీశైలం క్షేత్రానికి నిత్యం ఆర్టీసీ బస్సును నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లింగప్ప, భద్రప్ప, నాగేశ్ తదితరులు ఉన్నారు.
పూడూరు: ప్రభుత్వం పేదలకు అన్ని విధాల తోడుగా ఉంటుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ఆదివారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. చింతలపల్లికి చెందిన ప్రమీలకు రూ.54వేలు, మరాఠి పెంటయ్యకు రూ.8500ల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో అనేక జబ్బులకు ఉచితంగానే ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, మాధుసూదన్‌రెడ్డి, నరేందర్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.