చెరువులను టూరిజం స్పాట్‌లుగా మారుస్తాం
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:03 AM
వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న చెరువులను టూరిజం ప్రదేశాలుగా మారుస్తామని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రంగారెడ్డి అన్నారు.

మర్పల్లి, జులై 4 : వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్న చెరువులను టూరిజం ప్రదేశాలుగా మారుస్తామని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ రంగారెడ్డి అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆదేశాల మేరకు మర్పల్లి మండలం సిరిపురం, ఈర్లపల్లి, పంచలింగాల, కొంశెట్టిపల్లి, రావుల్‌పల్లి, కోట మర్పల్లి, కల్కోడ, మోమిన్‌పేట్ మండలం చంద్రన్‌సాగర్, బంటారం మండలంలోని మరి కొన్ని చెరువులను గురువారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల పరిస్థితి, నీట మట్టం, పూడికతీత పనులు తదితర అంశాలపై తెలుసుకున్నారు. త్వరలోనే ఈ చెరువులకు ప్రత్యేక నిధులు కేటాయించి ప్రతీ చెరువులో పూడికతీతతో పాటు ఆయకట్టు కింద ఉన్న ప్రతీ ఎకరాకు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎస్‌ఈ తెలిపారు. గుర్తించిన సమస్యలపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాము, సురేశ్, పాండు, రాచన్న, నర్సింహారెడ్డి, ఉప్పలి రమేశ్, చంద్రయ్య, రాచన్న తదితరులు పాల్గొన్నారు.