మత్స్యకారులను ఆదుకుంటాం
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:24 PM
మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

పరిగి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పరిగి పరిధిలోని వేన్నాచేడ్, సాలార్‌నగర్ చెరువుల్లో శుక్రవారం చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చేప పిల్లలను వందశాతం రాయితీపై ప్రభుత్వమే సరఫరా చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధానకార్యదర్శి కె.హన్మంత్‌ముదిరాజ్, నాయకులు జితేందర్‌రెడ్డి, కేఎం నారాయణ, గోపాల్ పాల్గొన్నారు.
ప్రతీ గ్రామానికి బీటీరోడ్డు వచ్చేలా కృషి
పూడూరు: ప్రతీ మారుమూల గ్రామానికి బీటీరోడ్డు వచ్చేలా కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని కెరవెళ్లి, దేవనోనిగూడ బీటీ రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామస్తులు, నాయకులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సతీ్‌షరెడ్డి, మండల అధ్యక్షుడు సురేందర్, నాయకులు ఆనంద్, నారాయణ, మోహిన్‌పాషా, అలీ, గ్రామస్తులు పాల్గొన్నారు.
సామాజిక వర్గాలకు సమన్యాయం
తాండూరు రూరల్: సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతోందని మత్స్యశాఖ సంఘం జిల్లా అధ్యక్షుడు అగ్గనూరు శ్రీధర్ అన్నారు. మండలంలోని అల్లాపూర్ ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డితో కలిసి 78వేల చేపపిల్లలను వదిలారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి గెలిచిన తర్వాత అన్ని విధాలుగా తాండూరు ప్రాంత అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జర్నప్ప, ఆజ్మత్‌అలీ, రాములు, భీమప్ప, నర్సింహులు, నర్సింహులు, వెంకటేష్ పాల్గొన్నారు.
మేడ్చల్ టౌన్: పూడూరు చెరువులో శుక్రవారం ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసిన చేప పిల్లలను స్థానిక మత్స్యకారులు వదిలారు. వర్షాకాలం అనంతరం చెరువులో నీటి మట్టం పెరగటంతో సుమారు 70వేల చప పిల్లలను వదిలామని ముదిరాజ్ సంఘం యువజన అధ్యక్షుడు ఎం.నాగరాజు ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు జి.పరమేష్, ఎన్.శ్రీరామ్, ఎన్.శ్రావణ్, పాండు, శ్రీనివాస్, గోపాల్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.