Share News

పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సనే ఆదరించిన కల్వకుర్తి ఓటర్లు

ABN , Publish Date - Jun 05 , 2024 | 12:16 AM

లోక్‌సభ ఎన్నికల్లోనూ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు కాంగ్రె్‌సనే ఆదరించారు. అధికార కాంగ్రె్‌సకు మెజార్టీని ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంతో పనిచేసిన పార్టీ శ్రేణులు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. దాంతో కల్వకుర్తిలో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగరవేసింది.

పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ కాంగ్రె్‌సనే ఆదరించిన కల్వకుర్తి ఓటర్లు
ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉదయ్‌ కుమార్‌ నుంచి ఎన్నిక పత్రాన్ని అందుకుంటున్న మల్లు రవి

హస్తం అభ్యర్థి మల్లు రవికి 11,827 ఓట్ల ఆధిక్యం

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు రెండో స్థానం

మూడో స్థానానికి పరిమితమైన

బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ప్రసాద్‌

మల్లు రవికి 63,720 , ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు

51,893, భరత్‌ ప్రసాద్‌కు 51,177 ఓట్లు

ఆమనగల్లు, జూన్‌ 4 : లోక్‌సభ ఎన్నికల్లోనూ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు కాంగ్రె్‌సనే ఆదరించారు. అధికార కాంగ్రె్‌సకు మెజార్టీని ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల విజయోత్సాహంతో పనిచేసిన పార్టీ శ్రేణులు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. దాంతో కల్వకుర్తిలో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగరవేసింది. హోరాహోరీగా సాగిన పోరులో కాంగ్రెస్‌ సత్తా చాటింది. ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజలు జైకొట్టారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,44,405 ఓట్లకు గాను.. 1,77,173 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ మల్లు రవికి 63,720, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు 51,893, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌కు 51,177 ఓట్లు లభించాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై మల్లు రవి 11,827 ఓట్ల ఆధిక్యం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ రెండో స్థానంతో పరువు కాపాడుకోగా.. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానానికి 19 మంది అఽభ్యర్థులు పోటీపడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌ ప్రసాద్‌ల మధ్యే రసవత్తర పోరు కొనసాగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచి తమ పట్టు సడలలేదని నిరూపించుకుంది. కాగా, కల్వకుర్తి నియోజకవర్గంలో నోటాకు 723 ఓట్లు వేశారు. అయితే, మొత్తం మీద.. మల్లు రవి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌పై 94,414 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మల్లు రవికి 4,65,072, బీజేపీ అభ్యర్థి భరత్‌ ప్రసాద్‌కు 3,70,658, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు 3,21,343 ఓట్లు లభించాయి. ఎంపీగా ఎన్నికైన మల్లు రవికి జిల్లా కలెక్టర్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఉదయ్‌ కుమార్‌ ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

Updated Date - Jun 05 , 2024 | 12:16 AM