Share News

‘అనురాగ్‌’ అధ్యాపకుడికి ‘విశిష్ఠ’ అవార్డు

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:55 PM

నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జనగా ఎమ్మెల్యే, అనురాగ్‌ యూనివర్సిటీ చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.

‘అనురాగ్‌’ అధ్యాపకుడికి ‘విశిష్ఠ’ అవార్డు
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేతులమీదుగా విశిష్ఠ అధ్యాపక అవార్డు అందుకుంటున్న మహిపతి శ్రీనివా్‌సరావు

ఘట్‌కేసర్‌ రూరల్‌ జనవరి 21: నైపుణ్యం కలిగిన అధ్యాపకులు ఉన్నప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జనగా ఎమ్మెల్యే, అనురాగ్‌ యూనివర్సిటీ చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నగరంలోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌లో శనివారం రాత్రి అంబిషన్స్‌ కెరీర్‌ కౌన్సిల్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకటాపూర్‌ అనురాగ్‌ యూనివర్సిటీ అధ్యాపకుడు మహిపతి శ్రీనివా్‌సకు విశిష్ఠ అధ్యాపక అవార్డును పల్లా రాజేశ్వర్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యాసంస్థల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యవంతమైన అధ్యాపకులు ఉన్నప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని చెప్పారు. శ్రీనివాస్‌ రెండు దశాబ్ధాలుగా ఇంగ్లీష్‌ మాధ్యమంలో, స్పోకెన్‌ ఇంగ్లీష్‌ తరగతులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మోటివేషన్‌ తరగతులు నిర్వహిస్తూ విశిష్ఠ సేవలు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. ఇంగ్లీషు ప్రాధాన్యత ఎంతో పెరిగిందని, విద్యార్థులు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి దానిపై పట్టుసాధించాలని తెలిపారు. అవార్డు రావడం సంతోషంగా ఉందని మహిపతి శ్రీనివాస్‌ తెలిపారు. అనురాగ్‌ యూనివర్సిటీ సీఈవో నీలిమ, అయా విభాగాల డీన్లు, అంబిషన్స్‌ సంస్థ ప్రతినిధులు శ్రీనివా్‌సను అభినందించారు.

Updated Date - Jan 21 , 2024 | 11:55 PM