Share News

వైభవంగా వెంకిర్యాల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:57 PM

మండల పరిధిలోని వెంకిర్యాల శివారులోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహోత్సవాల్లో.. మూడో రోజైన బుధవారం ఉదయం 5.30 గంటలకు రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి రథాన్ని లాగారు.

వైభవంగా వెంకిర్యాల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
రథాన్ని లాగుతున్న భక్తులు

కొందుర్గు, జనవరి 17: మండల పరిధిలోని వెంకిర్యాల శివారులోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహోత్సవాల్లో.. మూడో రోజైన బుధవారం ఉదయం 5.30 గంటలకు రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారి రథాన్ని లాగారు. స్వామివారికి పల్లికిసేవ నిర్వహించారు. సాయంత్రం వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గల మైసమ్మ ఆలయం చుట్టూ ఎడ్లబండ్లు, ట్రాక్టర్లను తిప్పి భక్తులు మొక్కులను చెల్లించుకున్నారు. మైసమ్మ తమను చల్లగా చూడాలని కోరుకున్నారు. సాయంత్రం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ జాతరలో పాల్గొని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని కోరారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషిచేస్తానని తెలిపారు. అంతకు ముందు మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి జాతరకు హాజరై ప్రత్యేకపూజలను చేశారు. వెంకిర్యాల, విశ్వనాథ్‌పూర్‌, లక్ష్మీదేవిపల్లి సర్పంచ్‌లు లింగమయ్యగౌడ్‌, శ్రీధర్‌రెడ్డి, నర్సింలు, ఆలయ కమిటీ చైర్మన్‌ రామకృష్ణ, ఈవో శ్రీనివాసశర్మ, నాయకులు కృష్ణారెడ్డి, రాజు, దామోదర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, పురుషోత్తంరెడ్డి, గోవర్థన్‌గౌడ్‌, బి.నరేందర్‌, వజ్రమ్మ, ఆంజనేయలు, యాదయ్య, మాసయ్యగౌడ్‌, నర్సింలు, గోవింద్‌, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:57 PM