Share News

ఘనంగా యాసీన్‌ బాబా దర్గా ఉర్సు

ABN , Publish Date - May 25 , 2024 | 11:43 PM

మండల పరిధి మర్రిపల్లిగూడలోని యాసీన్‌ బాబా దర్గా ఉర్సు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ముస్లింలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఘనంగా యాసీన్‌ బాబా దర్గా ఉర్సు
ఊరేగింపులో పాల్గొన్న గ్రామస్తులు

ఆనందోత్సాహాల మధ్య సందల్‌.. పెద్దఎత్తున పాల్గొన్న గ్రామస్తులు

ఘట్‌కేసర్‌ రూరల్‌, మే 25 : మండల పరిధి మర్రిపల్లిగూడలోని యాసీన్‌ బాబా దర్గా ఉర్సు శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ముస్లింలు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం జెండాకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఉర్సు నిర్వాహకుడు మహ్మద్‌ ముస్తఫా ఆధ్వర్యంలో గ్రామంలో ఊరేగింపు (సందల్‌) నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పుచప్పుళ్ల మధ్య యువకులు నృత్యాలు చేశారు. మండలంతో పాటు నగరం నుంచి భక్తులు పెద్దఎత్తున ఊరేగింపులో పాల్గొన్నారు. మజీద్‌ వరకు ర్యాలీ నిర్వహించి జెండాను అవిష్కరించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జాహంగీర్‌, షానూర్‌, అజీజ్‌, రషీద్‌, ఫయాజ్‌, ఇస్మాల్‌, ఉబేద్‌, చిలుగూరి లక్ష్మన్‌, మాజీ ఉపసర్పంచ్‌ నరేష్‌, పల్లపు శ్రీకాంత్‌, సోమని శివ, శంకర్‌, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 11:43 PM