Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

ఉరేసుకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ABN , Publish Date - Mar 03 , 2024 | 12:13 AM

ఉరివేసుకొని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌లో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

ఉరేసుకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

ఆదభట్ల, మార్చి 2 : ఉరివేసుకొని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాదర్‌గుల్‌లో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నాదర్‌గుల్‌లోని గ్రీన్‌హోమ్స్‌ కాలనీలోని ప్లాట్‌ నెంబర్‌ 301లో నివాసముంటున్న గున్నాల పూర్ణచందర్‌(36) ఆ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. సమాచారమందున్న ఆదిభట్ల పోలీసులు పంచనామ చేసి మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఇబ్రహీంపట్నం సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు విచారణలో తెలియనున్నాయని చెప్పారు.

Updated Date - Mar 03 , 2024 | 09:17 AM