Share News

ఉరేసుకొని జూనియర్‌ లైన్‌మన్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:24 PM

ఆన్‌లైన్‌ బెట్టింగులు, అప్పుల బాధతో జూనియర్‌ లైన్‌మెన్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీ్‌సస్టేషన్‌ పరిధి రాయపోల్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

ఉరేసుకొని జూనియర్‌ లైన్‌మన్‌ ఆత్మహత్య

ఆన్‌లైన్‌ బెట్టింగులు.. అప్పులే కారణం : పోలీసులు

ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 6: ఆన్‌లైన్‌ బెట్టింగులు, అప్పుల బాధతో జూనియర్‌ లైన్‌మెన్‌ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీ్‌సస్టేషన్‌ పరిధి రాయపోల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాయపోల్‌ గ్రామానికి చెందిన గుండ్లపల్లి నర్సింహారెడ్డి, సావిత్రిల కుమారుడు శివారెడ్డి(28) యాచారం మండలం మేడిపల్లిలో జూనియర్‌ లైన్‌మన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అతడు ఆన్‌లైన్‌ బెట్టింగులకు అలవాటుపడి అప్పుల పాలైనట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్ల్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

Updated Date - Feb 06 , 2024 | 11:24 PM