నిరంతర విద్యుత్ సరఫరా జరపాలి : ఎమ్మెల్యే
ABN , Publish Date - Mar 08 , 2024 | 12:03 AM
విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని , వేసవిలోనూ నిరంతరం విద్యుత్ సరఫరా జరపాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.
షాద్‌నగర్, మార్చి 7 : విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని , వేసవిలోనూ నిరంతరం విద్యుత్ సరఫరా జరపాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవిలో విద్యుత్ వినయోగం పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేపట్టాలన్నారు. కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో ఎలాంటి జాప్యం చేయరాదని తెలిపారు. డీఈ యాదయ్య, ఏడీ రవీందర్, మాధవరావు, ఏఈలు పాల్గొన్నారు.
ఓబేదుల్లాకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
షాద్‌నగర్ : తెలంగాణ స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మైనార్టీ నేత ఓబేదుల్లా కోత్వాల్‌కు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని హజ్ హౌజ్‌లో జరిగిన కోత్వాల్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు, మాజీ ఎమ్మెల్యే ప్రతా్‌పరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బాబర్‌ఖాన్ కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.