Share News

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Jun 22 , 2024 | 11:54 PM

అప్పుల బాధ భరించలేక ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ఘట్‌కేసర్‌ రూరల్‌, జూన్‌ 22: అప్పుల బాధ భరించలేక ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన గుండు నరే్‌షగౌడ్‌(36) కొంతకాలంగా ఈసీఐఎల్‌లో ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్నాడు. కాగా ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహణకు అప్పులు తీసుకొచ్చాడు. ప్రింటింగ్‌ ప్రెస్‌ సక్రమంగా నడవకపోడంతో అప్పులు ఎక్కువయ్యాయి. ఈ విషయాన్ని తరచూ తన కుటుంబసభ్యులతో చెబుతూ బాధపడేవాడు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో నరే్‌షగౌడ్‌ బాత్‌రూంలోని ఇనుపరాడ్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు నరే్‌షగౌడ్‌ కుటుంబసభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jun 22 , 2024 | 11:54 PM