Share News

రెండు కేజీల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:15 AM

గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచినట్లు కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

రెండు కేజీల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ విఠల్‌రెడ్డి

తాండూరు రూరల్‌: గంజాయి తరలిస్తున్న వ్యక్తులను పట్టుకుని కోర్టులో హాజరు పరిచినట్లు కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు మండలం గౌతాపూర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో అశోక్‌ ఖార్వాన్‌, రాజ్‌కుమార్‌ కరావర్‌ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారివద్దకు వెళ్లి విచారించగా, వారివద్ద రెండు కేజీల గంజాయి లభ్యమైంది. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అనంతరం అశోక్‌, రాజ్‌కుమార్‌లను కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Apr 27 , 2024 | 12:15 AM