Share News

గుర్రం దాడిలో ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - May 26 , 2024 | 11:51 PM

మండలంలోని ఘనపూర్‌ గ్రామంలో గుర్రం హల్‌చల్‌ చేసింది. నలుగురిపై దాడి చేయగా ఇద్దరికి గాయాలు కావడంతో గ్రామస్థులు గుర్రాన్ని బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుర్రం దాడిలో ఇద్దరికి గాయాలు
ఘనపూర్‌లో గుర్రాన్ని బంధించిన గ్రామస్తులు

కులకచర్ల, మే 26: మండలంలోని ఘనపూర్‌ గ్రామంలో గుర్రం హల్‌చల్‌ చేసింది. నలుగురిపై దాడి చేయగా ఇద్దరికి గాయాలు కావడంతో గ్రామస్థులు గుర్రాన్ని బంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘనపూర్‌ గ్రామంలో వడ్ల రాములు దగ్గర రెండు గుర్రాలున్నాయి. వీటి దగ్గరికి గత వారం రోజుల కిందట మరో గుర్రం (ఎవరిదో తెలియదు) వచ్చింది. రెండు రోజులుగా గుర్రం గ్రామం చుట్టూ తిరుగుతూ వ్యక్తులపై దాడి చేస్తోంది. గ్రామ ప్రజలు పొలాలకు వెళ్లాలన్నా, గ్రామం నుంచి పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుర్రం శనివారం రాత్రి దాడి చేయగా గ్రామానికి చెందిన నారాయణ, లక్ష్మయ్యకు గాయాలయ్యాయి. హన్మయ్య, వెంకటయ్యలు ఆసుపత్రిలో చికిత్స పొందారు. గ్రామస్థులు ఆదివారం ఉదయం గుర్రాన్ని బంధించారు. అనంతరం కులకచర్ల పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గుర్రాన్ని గ్రామం నుంచి తరలించాలని కోరారు.

Updated Date - May 26 , 2024 | 11:51 PM